అమెరికా తర్వాత మనమే: నారా లోకేష్(పిక్చర్స్)
హైదరాబాద్: అమెరికా సైన్యం 30లక్షల మందితో పటిష్ఠంగా ఉందని, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ 25లక్షల మంది కార్యకర్తలను నమోదు చేయడంతో బలోపేతమమవుతోందని ఆ పార్టీ యువనేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ అన్నారు. ఆయన గురువారం తొలిసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
నవంబర్ నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని చెప్పారు.
25 లక్షల మంది కార్యకర్తలను నమోదు చేసే లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, అండమాన్ నికోబర్ దీవులు, ఒరిస్సా రాష్ట్రాలలోను పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతామన్నారు.
ఈ రాష్ట్రాలలో డిసెంబరులో చేపడతామని చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదు బ్రోచర్‌ను పార్టీ నేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, కళా వెంకట్రావులతో కలిసి ఆవిష్కరించారు. కార్యకర్తల రుణం తీర్చుకునేందుకే సంక్షేమ నిధి ప్రారంభించామని ఈ సందర్భంగా లోకేష్ తెలిపారు. పార్టీ సభ్యత్వ రుసుము కేవలం రూ.10లు అన్నారు. క్రియాశీలక సభ్యత్వానికి 100 రూపాయలను ఎంట్రీ ఫీజుగా ఉంటుందన్నారు.
టీడీపీ కార్యకర్తలందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. కార్యకర్తల క్షేమం కోసమే సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామన్నారు. ప్రమాదాల్లో గాయపడ్డ కార్యకర్తలకు వైద్య సాయం అందిస్తామన్నారు. కార్యకర్తల రుణం తీర్చుకునేందుకే దీనిని ఏర్పాటు చేశామన్నారు. ఇది ఆరు నెలలుగా పని చేస్తోందన్నారు. ప్రతి కార్యకర్తకు ప్రమాద బీమా ఉంటుందన్నారు. కార్యకర్తల నుండి ఎనిమిదివేల వినతులు వస్తే అరవై శాతం పరిష్కరించామన్నారు.

లోకేష్
పార్టీ సభ్యత్వ నమోదు బ్రోచర్‌ను పార్టీ నేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, కళా వెంకట్రావులతో కలిసి నారా లోకేష్ ఆవిష్కరించారు. కార్యకర్తల రుణం తీర్చుకునేందుకే సంక్షేమ నిధి ప్రారంభించామని ఈ సందర్భంగా లోకేష్ తెలిపారు.

లోకేష్
అమెరికా సైన్యం 30లక్షల మందితో పటిష్ఠంగా ఉందని, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ 25లక్షల మంది కార్యకర్తలను నమోదు చేయడంతో బలోపేతమమవుతోందని ఆ పార్టీ యువనేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ అన్నారు.

నారా లోకేష్
నవంబర్ నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని చెప్పారు.
25 లక్షల మంది కార్యకర్తలను నమోదు చేసే లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటామన్నారు.

నారా లోకేష్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, అండమాన్ నికోబర్ దీవులు, ఒరిస్సా రాష్ట్రాలలోను పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతామన్నారు.

లోకేష్
ఈ రాష్ట్రాలలో డిసెంబరులో చేపడతామని చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని చెప్పారు.

లోకేష్
పార్టీ సభ్యత్వ నమోదు బ్రోచర్‌ను పార్టీ నేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, కళా వెంకట్రావులతో కలిసి ఆవిష్కరించారు. కార్యకర్తల రుణం తీర్చుకునేందుకే సంక్షేమ నిధి ప్రారంభించామని ఈ సందర్భంగా లోకేష్ తెలిపారు.

లోకేష్
సభ్యత్వం నమోదు అయ్యాక వారం రోడుల్లో సభ్యత్వ కార్డులు పంపిస్తామన్నారు. ఈసారి పేపర్ లెస్ విధానంలో సభ్యత్వ నమోదు ఉంటుందన్నారు. అందరికీ ట్యాబ్‌లు ఇచ్చినట్లు తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications