టీడీపీలో కరోనా కలకలం.. పరిటాల శ్రీరామ్‌కు పాజిటివ్.. ఆస్పత్రిలో ఇద్దరు కీలక నేతలు
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లోనే 2,64,202 మందికి పాజిటివవ్‌గా నిర్థారణ అయింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య రెట్టింపు అవుతుంది. గురువారం ఒక్కరోజే 4,348 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ కరోనా బారిన రాజకీయ, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు పడ్డారు. తాజాగా అనంతపురం జిల్లా, ధర్మవరం టీడీపీ ఇన్ చార్జీ, మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్‌కు కరోనా సోకింది. పాజిటివ్‌గా నిర్థారణ అయిందని సోషల్ మీడియా ద్వారా ఆయన తెలిపారు.
శ్రీరామ్‌కు స్వల్ప లక్షణాలతో కరోనా..
తనకు కరోనా పరీక్షలో స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని పరిటాల శ్రీరామ్ తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు అందరూ జాగ్రత్తగా ఉండాని సూచించారు. ఏవైనా లక్షణాలు కన్పిస్తే వెంటనే టెస్టులు చేయించుకోవాలని కోరారు. అశ్రద్ధ చేయోద్దన్నారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఏపీలో ముగ్గురు టీడీపీ నేతలకు కరోనా
ఏపీలో ఇప్పటికే మంత్రి కొడాలి నాని, టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, వంగవీటి రాధా కరోనా బారినపడ్డారు. వీరంతా హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్సపోందుతున్నారు.
పరిటాల శ్రీరామ్ గత వారం రోజులుగా ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో తన తల్లి, మాజీ మంత్రి పరిటాల సునీతతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా శ్రీరామ్‌కు కరోనా సోకింది. ఈనేపథ్యంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాస్క్ తప్పని సరిగా పెట్టుకోవాలనన్నారు.

ఏపీలో కరోనా విలయం
ఏపీలో కరోనా విలయంతాండం చేస్తోంది. గురువారం 47,884 శాంపిల్స్ పరీక్షించగా 4,348 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. 261 మంది కరోనా నుంచి కోలుకోగా.. కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 14,507కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 932 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. తర్వాత విశాఖపట్నం 823, నెల్లూరు 395, గుంటూరు 338, కృష్ణా 296, విజయనగరం 290 మంది కరోనా బారిన పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో 259, తూర్పుగోదావరి 247, అనంతపురం 230, కడప 174, కర్నూలు 171, ప్రకాశం 107, పశ్చిమగోదావరి జిల్లాలో 86 పాజిటివ్ కేసులు వచ్చాయి.












Click it and Unblock the Notifications