AP Sticker War : జగన్ స్టిక్కర్లకు పోటీగా విజయవాడలో టీడీపీ కౌంటర్ స్టిక్కర్లు..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల ఫీడ్ బ్యాక్ తెలుసుకునేందుకు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ప్రారంభించింది. రెండు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా సాగే ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ ప్రజాప్రతినిధులు సంక్షేమ పథకాల లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఫీడ్ బ్యాక్ తీసుకుని వారి ఇళ్లకు మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్లు అతిస్తున్నారు. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి.
ఏపీలో సంక్షేమ పథకాల లబ్దిదారుల ఇళ్లకు మా నమ్మకం నువ్వేజగన్ స్టిక్కర్లు అతికించడంపై మండిపడుతున్న విపక్షాలు.. పోటీగా తమ స్టిక్కర్లు అంటించడం మొదలుపెట్టాయి. వైసీపీ నేతలు జగన్ స్టిక్కర్లు అతికించి వెళ్లగానే టీడీపీ, జనసేన నేతలు వచ్చి తమ స్టిక్కర్లు అతికిస్తున్నారు. ఇప్పటికే తిరుపతిలో జనసేన నేతలు జగన్ స్టిక్కర్లకు పోటీగా మాకు నమ్మకం లేదు జగన్ అంటూ స్టిక్కర్లు అంటించగా.. ఇప్పుడు టీడీపీ విజయవాడలో దాదాపు ఇలాంటి కార్యక్రమమే చేపట్టింది.

విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేతలు మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో అంటించిన స్టిక్కర్లకు పైన టీడీపీ నేతలు కౌంటర్ స్టిక్కర్లను ఇవాళ్టి నుంచి అంటించడం మొదలుపెట్టారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి- మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలంటూ ఈ స్టిక్కర్లపై నినాదాలు దర్శనమిస్తున్నాయి. వీటిపై స్ధానిక టీడీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, చంద్రబాబు ఫొటోల్ని పెట్టి అంటిస్తున్నారు. దీంతో ఈ స్టిక్కర్ వార్ కలకలం రేపుతోంది.













Click it and Unblock the Notifications