వైఎస్ సమాధికి వినతిపత్రం!: ముద్రగడ పాదయాత్రకు కౌంటర్‌గా టీడీపీ అస్త్రం

విజయవాడ : ఇప్పటికే ఓ దఫా కాపు ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించి.. టీడీపీ ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కాపు ఉద్యమ నేత ముద్రగడ. అయినప్పటికీ.. ప్రభుత్వ వైఖరిలో పెద్దగా మార్పేమి లేకపోవడంతో.. మరోసారి పాదయాత్ర అస్త్రంతో ప్రభుత్వ మెడలు వంచాలనే యోచనలో ఉన్నారాయన.

ఈ నేపథ్యంలోనే న‌వంబ‌ర్ 16 నుంచి ఐదు రోజుల‌పాటు స‌త్యాగ్ర‌హ పాద‌యాత్రకు ముద్రగడ సిద్దమైన సంగతి తెలిసిందే. ఇక దీనికి కౌంటర్ ఇవ్వడానికా అన్నట్టు.. టీడీపీ నేత, కాపు కార్పొరేష‌న్ ఛైర్మన్ రామానుజ‌య‌ కూడా అదే రోజున బ‌లిజ శంఖారావం పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. తన పాదయాత్ర ద్వారా.. కాపుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టాలని ముద్రగడ భావిస్తుంటే.. కాపు-బలిజ సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తోన్న కృషిని జనంలోకి తీసుకెళ్లాలనే యోచనలో రామానుజయ ఉన్నారు.

ఇందుకోసం రాష్ట్రం నలుమూలల నుంచి బలిజ సామాజిక వర్గాన్ని ఐక్యం చేసి పాదయాత్ర చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబుపై ముద్రగడ చేసే ఆరోపణలను ఈ పాదయాత్ర ద్వారా తిప్పికొడుతూనే.. ప్రతిపక్ష నేత జగన్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడానికి కూడా పాదయాత్రను ఉపయోగించాలని రామానుజయ భావిస్తున్నారు. ఇదే క్రమంలో 'వైఎస్ సమాధికి వినతిపత్రం' ఇచ్చేందుకు కూడా సిద్దమవుతున్నారట రామానుజయ.

TDP plans counter to mudragada padayatra

బలిజ-కాపుల సంక్షేమానికి ప్రధాన అడ్డంకి ముద్రగడ, జగన్ అన్న వాదనను ఆ వినతిపత్రంలో పొందుపర్చారట. వైఎస్ కు వినతిపత్రం ద్వారా ఈ అంశాన్ని హైలైట్ చేయాలనే వ్యూహాల్లో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. ముద్రగడ ప్రతిఘటనతో ఇప్పటికే కాపులంతా టీడీపీకి దూరమయ్యే పరిస్థితి నెలకొనగా.. తాజా పాదయాత్ర ద్వారా బలిజ సామాజిక వర్గంపై పట్టు సడలిపోకుండా జాగ్రత్త పడాలనే యోచనలో ఉంది చంద్రబాబు ప్రభుత్వం.

ఇదిలా ఉంటే రాయలసీమలో సంఖ్యాపరంగా బలిజల ప్రాబల్యం కూడా బలంగానే ఉంది. దీనికి తోడు కాపులకు-బలిజలకు మధ్య ఉన్న విబేధాలను ఆసరాగా చేసుకుని బలిజలను తమవైపుకు తిప్పుకోగలిగితే.. సీమలో జగన్ దూకుడుకు బ్రేక్ వేయవచ్చనేది కూడా టీడీపీ ఆలోచనగా తెలుస్తోంది. మొత్తానికి అటు ముద్రగడ, ఇటు రామానుజయ పాదయాత్రలతో రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+