సుజనా చౌదరికి ఎసరు: రాజ్యసభకు బాలకృష్ణ, అసెంబ్లీకి నారా లోకేష్?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో పవర్ గేమ్ ఊపందుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. సుజనా చౌదరి ఈసారి రాజ్యసభలోకి అడుగు పెట్టకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అయితే, అది ఎంత నమ్మశక్యమనేది తెలియడం లేదు. అదే సమయంలో నారా లోకేష్ ఒక దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలని భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది. నారా లోకేష్‌ను రాజ్యసభకు పంపించి, కేంద్ర మంత్రి పదవి వచ్చేలా చూడాలని తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చంద్రబాబును బహిరంగంగానే కోరారు.

అయితే, లోకేష్ ఆలోచన మరో రకంగా ఉన్నట్లు చెబుతున్నారు. మామ బాలకృష్ణను రాజ్యసభకు పంపిస్తే అన్ని రకాలుగా తాను అనుకున్నది జరుగుతుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. తనకు రాజ్యసభ టికెట్ ఇవ్వాలని నందమూరి హరికృష్ణ ఇప్పటికే దరఖాస్తు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
బాలయ్యను రాజ్యసభకు ప్రతిపాదిస్తే సుజానా చౌదరినీ, హరికృష్ణను ఇద్దరినీ అడ్డుకోవడం సులభమవుతుందని నారా లోకేష్ వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు. దీనివల్ల తాను హిందూపురం నుంచి శాసనసభలోకి అడుగు పెట్టి తండ్రి వారసుడిగా చక్రం తిప్పడానికి వీలవుతుందని లోకేష్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద. అధికార రాజకీయాల్లోకి రావాలని నారా లోకేష్ ఉవ్విళ్లూరుతున్నట్లు చెబుతున్నారు.
.


Click it and Unblock the Notifications