వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు చంద్రబాబు లేఖాస్త్రం: మేము తెచ్చిన జీవో మాటేంటీ? చట్టంలో సవరణలు..సుప్రీంకోర్టు

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై లేఖాస్త్రాన్ని సంధించారు. గిరిజనుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. గిరిజనుల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైంని ఆరోపించారు. గిరిజనులకు న్యాయం చేయడానికి అవసరమైతే చట్టంలో సవరణలను తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్డ్ ఏరియాల్లో గిరిజన ఉపాధ్యాయులు తమ ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ ఎమ్మెల్యేల బలమెంతో కాస్సేపట్లో బహిర్గతం: వారి ఓటు ఎటో తేలుతుంది: అచ్చెన్నకూటీడీపీ ఎమ్మెల్యేల బలమెంతో కాస్సేపట్లో బహిర్గతం: వారి ఓటు ఎటో తేలుతుంది: అచ్చెన్నకూ

గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉండాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. షెడ్యూల్డ్ ఏరియాల్లో గల ప్రభుత్వ పాఠశాలల్లో గిరిజనులకు వందశాతం రిజర్వేషన్లను కల్పిస్తూ 2000లో తమ ప్రభుత్వ హాయంలో తీసుకొచ్చిన జీవో నంబర్ 3ను అమలు చేయాలని అన్నారు. ఈ జీవోను సుప్రీంకోర్టు కొట్టేసినప్పటికీ.. చట్టంలో సవరణలను తీసుకుని రావాలని సూచించారు. గిరిజనులకు ఉద్యోగాలలో 100 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టేసిన నేపథ్యంలో గిరిజనుల హక్కులను కాపాడటానికి న్యాయపరమైన అన్ని చర్యలను తీసుకోవాలని అన్నారు.

TDP President Chandrababu writes letter to YS Jagan on Tribal welfare schemes

స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లను కల్పించినట్లు తూతూమంత్రంగా చేయొద్దని చంద్రబాబు పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వపరంగా అన్ని చర్యలను తీసుకోవాని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాజీ హాకీ ఛాంపియన్ జైపాల్ సింగ్ ముండా చేసిన కొన్ని వ్యాఖ్యలను తన లేఖలో పొందుపరిచారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గిరిజనుల ఉపాధ్యాయులకు అవకాశాలను కల్పిస్తూ తాము జీవో నెంబర్.3ని తీసుకొచ్చామని చెప్పారు.

Recommended Video

AP Assembly Budget Sessions Guidelines ఇలాంటి అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడూ చూసుండరు ?

జీవో నెంబర్.3 విషయంపై న్యాయపరమైన చర్యలన్నింటినీ తీసుకోవాలని అన్నారు. గిరిజనులకు న్యాయం చేయడానికి కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిందిగా సూచించారు. గిరిజన సంక్షేమంపై చిత్తశుద్ధితో కృషి చేయాలని, వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూాడాలని అన్నారు. గిరిజనులకు న్యాయం చేయడం కోసం ప్రస్తుతం ఉన్న చట్టాలలో సవరణలు చేయాలని అన్నారు. అవసరమైతే కొత్త చట్టాన్ని తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గిరిజనులకు అన్యాయం జరగకుండా చూడాలని చంద్రబాబు ఈ లేఖలో డిమాండ్ చేశారు.

English summary
Telugu Desam Party President and Former Chief Minister Chandrababu writes letter to YS Jagan on Tribal welfare schemes. He told Government showing Lack of sincerity in protecting rights of the tribal people, Loss of jobs to Tribal people, Essentialto protect the rights of weak and downtrodden for their empowerment..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X