టీడీపీకి బిగ్ రిలీఫ్ - ఎన్నికల్లో గెలుపు దక్కేనా...!!
ఏపీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ల ఉప సంహరణకు ఈ రోజు తుది గడువు. కూటమి అభ్యర్దులకు రెబల్స్ గా నామినేషన్ల దాఖలు చేసిన వారితో బుజ్జగింపులు కొనసాగు తున్నాయి. హోరాహోరీగా మారిన ఎన్నికల సమరంలో ప్రతీ నియోజకవర్గంలో గెలుపును పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ సమయంలోనే టీడీపీకి కొంత రిలీఫ్ కనిపిస్తోంది. ఎన్నికల్లో ఈ పరిణామం కలిసి వచ్చేనా అనే చర్చ మొదలైంది.
రెబల్ విత్ డ్రా
టీడీపీ నుంచి సీట్లు ఆశించి దక్కని పలువురు నేతలు రెబల్స్ గా నామినేషన్లు దాఖలు చేసారు. వారితో నామినేషన్లను ఉప సంహించేలా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా నూజీవీడు నియోజకవర్గంలో టీడీపీ రెబల్ అభ్యర్ది ముద్రబోయిన వెంకటేశ్వరరావు సోమవారంనామినేషన్ ని విత్ డ్రా చేసుకున్నారు. ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఆయన భార్య రాధిక కూడా విత్ డ్రా పారాలపై సంతకాలు చేసి తన ప్రతినిధులకు ఇచ్చి నూజివీడు ఆర్డీవోకి అందించారు. దీంతో, కీలక నియోజకవర్గంలో టీడీపీకి రిలీఫ్ దక్కింది. మాజీ మంత్రి పార్ధసారధి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సమయం నుంచి నూజివీడు సీటు ఆశించిన ముద్రబోయిన ఆగ్రహంతో ఉన్నారు.

అంగీకరించిన ముద్రబోయిన
ముద్రబోయిన చంద్రబాబు సమక్షంలో తిరిగి టీడీపీలో చేరనున్నారు. పార్దసారధికి సీటు ఖాయం కావటంతో ముద్రబోయిన కన్నీరు పెట్టుకున్నారు. పార్టీకి రాజీనామా చేసారు. క్యాంపు కార్యాలయంలో జగన్ ను కలిసారు. కానీ, వైసీపీలో చేరలేదు. స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేయాలని నిర్ణయించారు. నామినేషన్ దాఖలు చేసారు. దీంతో, పార్ధసారధిలో టెన్షన్ పెరిగింది. ఈ సమయంలో చంద్రబాబు నేరుగా ముద్రబోయిన తో చర్చించారు. పార్దసారధికి సహకరించాలని సూచించారు. అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో..ముద్రబోయిన అంగీకరించారు. ఈ రోజు తన నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. దీంతో..ఇప్పుడు నూజివీడు పోరు ఆసక్తి కరంగా మారుతోంది.
నూజివీడులో గెలుపెవరిది
నూజివీడులో వైసీపీ నుంచి మేకా వెంకట ప్రతాప అప్పారావు, టీడీపీ నుంచి పార్దసారధి మధ్య పోటీ నెలకొంది. స్థానికత అంశం ప్రచార అస్త్రంగా మారింది. అయితే, తాను మూడు సార్లు గెలిచిన నేతగా ప్రజల సమస్యల పైన అవగాహన ఉందని పార్దసారధి చెబుతున్నారు. అభివృద్ధి కావాలా స్థానికత కావాలా అంటూ ఓటర్లను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు వైసీపీ అభ్యర్ది వరుసగా గెలుస్తుండటం..సంక్షేమ ఓట్ బ్యాంక్ కలిసి వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు ముద్రబోయిన ఏ మేరకు పార్థసారధికి సహకారం అందిస్తారు...నూజివీడు లో ఎన్నికల ఫలితం ఏంటనేది ఇప్పుడు రాజకీయంగా మరింత ఆసక్తిని పెంచుతోంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications