తెలుగుతమ్ముళ్లలో జోష్ నింపేలా టీడీపీ మాస్టర్ ప్లాన్.. ఆ యాప్‌తో వారి పర్ఫార్మెన్స్ ర్యాంకింగ్!!
తెలుగుదేశం పార్టీ పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తల కోసం బంపర్ ఆఫర్ ఇచ్చింది. పార్టీ కోసం కీలకంగా పని చేస్తే ఎవరికైనా పార్టీలో గుర్తింపు ఉంటుందని తెలియజేసే ప్రయత్నంలో భాగంగా సరికొత్త మన టిడిపి మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన టిడిపి పార్టీ కోసం మీరు చేసే కృషి అందరికీ తెలియడం కోసం ఈ యాప్ ను రూపొందించామని పేర్కొంది.

తెలుగుదేశం పార్టీ సర్వ సమాచారం.. 'మన టీడీపీ' యాప్ తో
మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తా? తెలుగుదేశం పార్టీ సర్వ సమాచారం మీ అరచేతిలో ఉండాలనుకుంటున్నారా? పార్టీ కోసం మీరు చేస్తోన్న కృషి పార్టీలో అందరికీ తెలియాలి అనుకుంటున్నారా? అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసిన టిడిపి, అయితే మీ దగ్గర తప్పక ఉండాల్సిన యాప్ "మనTDP". నేడే మీ మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకోండి అంటూ పేర్కొంది. ఇక ఈ యాప్ కు సంబంధించిన అనేక విషయాలను తెలియజేస్తూ మీ దగ్గర మన టిడిపి యాప్ ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సమస్తము మీ దగ్గర ఉన్నట్లే అని పేర్కొంది.
Recommended Video


మన టీడీపీ యాప్ ద్వారా ఏం చెయ్యవచ్చో చెప్పిన టీడీపీ
మన టిడిపి యాప్ ద్వారా గ్యాలరీ ఆప్షన్ నుంచి పార్టీకి సంబంధించిన వివిధ కార్యక్రమాల ఫోటోలు, వీడియోలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాటలు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలుగుదేశం పార్టీ పేర్కొంది. అంతేకాదు తెలుగుదేశం పార్టీ ప్రచురిస్తున్న చైతన్య రథం ఈ పేపర్ ను కూడా చదువుకోవచ్చని వెల్లడించింది. ఇక పార్టీకి సంబంధించి పోల్స్ అన్న ఆప్షన్ ద్వారా వివిధ పోల్స్ లో పాల్గొని మీ అభిప్రాయాలను చెప్పవచ్చని తెలుగుదేశం పార్టీ పేర్కొంది. ఇక విష్ అనే ఆప్షన్ ద్వారా మీ స్నేహితుల పుట్టినరోజుకు చంద్రబాబు లేదా లోకేష్ చెబుతున్నట్లుగా శుభాకాంక్షలు పంపించవచ్చని టిడిపి వెల్లడించింది.

సోషల్ మీడియా యాక్టివిటీ ఆధారంగా కార్యకర్తలకు ర్యాంకింగ్
ఫీడ్ అనే టాబ్ ద్వారా పార్టీ సమాచారాన్ని వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లలో షేర్ చేయవచ్చని పేర్కొంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ల ద్వారా మీరు చేస్తున్న పోస్ట్ లు ఎక్కువమందికి రీచ్ అవుతుంటే మీ పోస్ట్ లు సోషల్ మీడియా కార్నర్ లో చూపించబడి ఎక్కువమందికి రీచ్ అవుతాయని టిడిపి పేర్కొంది . యాప్ ద్వారా మీరు చేసే సోషల్ మీడియా యాక్టివిటీకి మీకు ర్యాంకింగ్ ఇవ్వబడుతుందని, ఇందులో మీ ర్యాంక్ స్టేట్ వైడ్ గా ఎంత ఉంది. పార్లమెంటు స్థాయిలో, నియోజకవర్గస్థాయిలో ఎంత ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుందని టిడిపి పేర్కొంది.

పార్టీ కార్యక్రమాలలో కార్యకర్తలను భాగస్వామ్యం చేసే ప్లాన్
ఇక క్యాంపెయిన్ అన్న టాస్క్ ద్వారా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనవచ్చని టిడిపి వెల్లడించింది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు, పునరుద్ధరణ కూడా చేసుకోవచ్చని టిడిపి పేర్కొంది. లీడర్ బోర్డు అన్న ట్యాబ్ ద్వారా మీ పర్ఫామెన్స్ కు ఎన్ని పాయింట్స్ వచ్చాయి. ఆ పాయింట్ ద్వారా మీ స్టేట్, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ ర్యాంకింగ్ ఎంత అనేది తెలుసుకోవచ్చని పేర్కొంది.

పార్టీలో క్రియాశీలకంగా పని చేసే వారికి గుర్తింపు
మన టిడిపి యాప్ ద్వారా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉండే కార్యకర్తలను, క్రియాశీలకంగా పని చేసేవారిని, సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించే వారిని తెలుగుదేశం పార్టీ గుర్తించనుంది. పార్టీలో దశాబ్దాలుగా పనిచేస్తూ ఎటువంటి గుర్తింపు లేకుండా క్రింద స్థాయిలో ఉండిపోయిన పార్టీ కార్యకర్తలకు మన టిడిపి యాప్ పార్టీ కోసం వారు చేసే కృషిని తెలియజేయడానికి ఒక సువర్ణ అవకాశాన్ని ఇచ్చిందని టిడిపి శ్రేణులు భావిస్తున్నారు.
-
ఈ కొమ్మల మధ్య ఉన్న జంతువులను కనిపెట్టగలరా ..? -
ఈ ఫోటోలో సముద్రపు అడుగున దాగి ఉన్న "నిధి"ని చూశారా..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి












Click it and Unblock the Notifications