అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ సభపై అంతా గప్‌చుప్, ఒక్కరోజులో ఊహించని షాకిచ్చిన పవన్, ఇదీ జరిగింది!!

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల గుంటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ను టార్గెట్ చేశారు. అవినీతి జరుగుతోందంటూ దుమ్ముదులిపేశారు. అప్పటి వరకు పవన్ టీడీపీ మిత్రుడిగానే విపక్ష వైసీపీ సహా పలువురికి కనిపించారు.

Recommended Video

2019 Elections : టీడీపీ కాంగ్రెస్ తో, పవన్ లెఫ్ట్ పార్టీలతో ?

బీజేపీ వల్లే గెలిచావ్.. ఇదీ లెక్క, ఓటుకు నోటు నుంచి ఎస్కేప్, మీరే కారణం: బాబుపై ఉండవల్లిబీజేపీ వల్లే గెలిచావ్.. ఇదీ లెక్క, ఓటుకు నోటు నుంచి ఎస్కేప్, మీరే కారణం: బాబుపై ఉండవల్లి

కానీ ఆయన గుంటూరు సభ ఏపీ రాజకీయ పరిణామాలనే మార్చివేసింది. అప్పటి వరకు అవిశ్వాసంపై నో చెప్పిన చంద్రబాబు యూటర్న్ తీసుకోవడం, వెంటనే ప్రత్యేక హోదా పల్లవి అందుకోవడం, ఎన్డీయే నుంచి బయటకు రావడం, మరోవైపు, జగన్-బీజేపీలు దగ్గరవుతున్నట్లుగా కనిపించడం చకచకా సాగిపోతున్నాయి. దీనికంతటికీ ఓ విధంగా పవన్ గుంటూరు సభనే కారణం.

సాయంత్రం 6 వరకు అసలు అజెండానే తెలియదు

సాయంత్రం 6 వరకు అసలు అజెండానే తెలియదు

అలాంటి గుంటూరు సభపై ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి. జనసేన నాలుగో ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతారనే విషయం ఆ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు టీడీపీ వారికి ఎవరికీ తెలియదట.

 పార్టీ ఎమ్మెల్యేల ఫండింగ్, ఊహించని షాకిచ్చిన పవన్

పార్టీ ఎమ్మెల్యేల ఫండింగ్, ఊహించని షాకిచ్చిన పవన్

జనసేన ఆవిర్భావ దినం అయిన మార్చి 14 వరకు పవన్‌ను చాలామంది టీడీపీ మిత్రుడిగానే భావించారు. అంతకుముందు ఆయన తీరు కూడా అలాగే కనిపించిందని వైసీపీ పలుమార్లు చెప్పింది. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ, వైసీపీలను తూలనాడుతారని చాలామంది భావించారు. కానీ ఏకంగా టీడీపీని ఎక్కువగా టార్గెట్ చేసుకున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమంటే ఈ సభకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు పాక్షికంగా నిధులు సమకూర్చారట. కానీ ఆయన టీడీపీని టార్గెట్ చేస్తారని ఎవరూ ఊహించలేదు.

 అప్పటి దాకా ఎవరికీ తెలియని అజెండా

అప్పటి దాకా ఎవరికీ తెలియని అజెండా

పవన్ కళ్యాణ్ ప్లాన్స్ ఏమిటో ఆయన నోటి నుంచి వచ్చే వరకు ఎవరికీ తెలియవంట. ఆయన ఈ విషయంలో పూర్తిగా మౌనంగా ఉన్నారట. అతని అజెండా ఆయనకు తప్ప మరెవరికీ తెలియదని తెలుస్తోంది. ఇప్పుడు టీడీపీ నేతలు ఆయనపై భగ్గుంటోన్న విషయం తెలిసిందే.

ఇదంతా మా ఫెయిల్యూర్!

ఇదంతా మా ఫెయిల్యూర్!

దీనిపై ఓ పార్టీ నేత ఓ వెబ్ మీడియాతో మాట్లాడుతూ... తన ప్లాన్‌ను పవన్ ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారని, అతని అజెండా ఎవరికీ తెలియదని, అసలు రెండు లక్షలమంది అతని మీటింగ్‌కు వస్తారని ఎవరు ఊహిస్తారని, ఇదంతా తమ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని, అసలు జనసేనకు కీలక నేతలు ఎవరూ లేరని వ్యాఖ్యానించారట.

 పవన్ తిరిగి టీడీపీ వైపు వస్తారా?

పవన్ తిరిగి టీడీపీ వైపు వస్తారా?

టీడీపీకి వ్యతిరేకంగా పవన్ అంత గట్టిగా మాట్లాడటం అదే మొదటిసారి. ఇది చూసి టీడీపీ నేతలు అవాక్కయ్యారు. మరో నేత మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌ను ఇప్పటికీ తమ మిత్రుడిగానే భావిస్తున్నామని, 118 పేజీల శ్వేతపత్రాలు పంపించామని, వాటిని చూసి ఆయన తిరిగి మా వైపు వస్తారని భావిస్తున్నామని భావిస్తున్నారట.

English summary
TDP ally Jana Sena Party chief Pawan Kalyan hurled allegations of corruption at a public meeting near Guntur against Chandrababu Naidu and his son Nara Lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X