టీడీపీకి ఆ పరిస్థితి రాకూడదు- జనసేనతో పొత్తుపై జ్యోతుల నెహ్రూ సంచలనం..!!
ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి అవుతోంది. ఇటు టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు ఘనంగా నిర్వహించేందుకు సిద్దం అవుతోంది. ఇదే సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ మహానాడు లో పార్టీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. జనసేనతో వస్తున్న సమస్యల పైన టీడీపీ నేతలు ఏకరువు పెడుతున్నారు. పార్టీ ముఖ్య నేత జ్యోతుల నెహ్రూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
టిడిపి జిల్లా మహానాడులో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కీలక వ్యాఖ్యలు చేసారు. కాకినాడ జిల్లాలో పదవులు ఏ పార్టీకి వెళ్లాయో ఆలోచించాలని సూచించారు. మెజారిటీ ఉన్న తెలుగుదేశం పరిస్థితి ఏంటో ఆలోచించాలని వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తికి రెండు పదవులు అవసరమా( కూడా చైర్మన్ గా, డిసిసిబి చైర్మన్ గా ఉన్న జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు) ప్రశ్నించారు. పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్వం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేసారు. కూటమి ఎన్నాళ్లు ఉంటుంది.. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదని చెప్పుకొచ్చారు. ఎన్నిసార్లు బయటకు రాలేదు అంటూ వ్యాఖ్యానించారు. టిడిపితో పొత్తు వల్ల కమ్యూనిస్టు పార్టీలు నిర్వీర్యం అయిపోయాయని చెప్పుకొచ్చారు.

అదే పరిస్థితి టీడీపీ కి రాకుండా చూడాలని జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ వాళ్లకు ఇవ్వద్దని తాను అనటం లేదన్నారు. టీడీపీకి రావాల్సిన నిష్పత్తి ప్రకారం ఇవ్వాలని నెహ్రూ సూచించారు. ద్వితీయ శ్రేణి నేతలు కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పలేక పోతున్నారని పేర్కొన్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి రావాల్సిన వాటా పదవులు సక్రమంగా ఇవ్వాలని కోరారు. అదే విధంగా బుధవారం కాకినాడ టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ చేసిన కామెంట్స్ సైతం సంచలనంగా మారాయి. కాకినాడ రూరల్ కి టీడీపీ ఇంఛార్జి ని ప్రకటించకపోవడం పార్టీ తప్పిదంగా పేర్కొన్నారు. కాకినాడ రూరల్ జనసేన భారీ మెజారిటీ కి టీడీపీ కార్యకర్తలు కారణం అని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు ను కాపాడుకోకపోతే వ్యవహారం గాడి తప్పుతుందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications