తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కన్నుమూత
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత లాలం భాస్కరరావు అనారోగ్యంతో కన్ను మూశారు. నెల క్రితం గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న భాస్కరరావు విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తిగా కోలుకున్నారనుకున్న సమయంలో అకస్మాత్తుగా కన్నుమూశారు. ఆయన మరణంపై పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఇతర నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
లాలం భాస్కరరావు మృతి పార్టీకి తీరని లోటు అని చంద్రబాబునాయుడు అన్నారు. కొద్ది రోజుల క్రితం గుండెకు శస్త్ర చికిత్స చేయించుకొని కోలుకుంటున్నారనున్న సమయంలో భాస్కరరావు ఇలా దూరమవడం ఎంతగానో బాధించిందన్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కీలక నేతగా ఉన్నారని, పార్టీ కోసం నిరంతరం శ్రమించారని కొనియాడారు. భాస్కరరావు సతీమణి భవానీకి చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

క్రమశిక్షణ కలిగిన నాయకుడిని పార్టీ కోల్పోయిందని, తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి విశాఖ జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన కృషి, అందించిన సేవలు మరువలేనిదని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నామని.. ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
రాంబిల్లి మండలం లాలంకోడూరులోని భాస్కరరావు స్వగృహం వద్ద పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచారు. 2009 ఎన్నికల్లో యలమంచిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన భాస్కరరావు పార్టీకి కీలకమైన నేతగా ఉన్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అత్యంత సన్నిహితుడు. భాస్కర్‌రావు సతీమణి భవానీ ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు.












Click it and Unblock the Notifications