వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత : జగన్ సమక్షంలో పార్టీలో చేరిక..!!

టీడీపీ సీనియర్లు ఒక్కొక్కరుగా వైసీపీలో చేరుతున్నారు. రెండు రోజుల క్రితం టీడీపీ మాజీ ఎమ్మెల్యే...తెలుగు మహిళ అధ్యక్షురాలిగా పని చేపిన శోభ హైమవతి టీడీపీకి రాజీనామా చేసారు. ఇప్పుడు టీడీపీలో కీలకంగా పని చేసిన మైనార్టీ కుటుంబం నుండి ముఖ్య నేత వైసీపీలో చేరారు. గుంటూరు కు చెందిన లాల్ జాన్ భాషా కుటుంబం తొలి నుంచి టీడీపీలో పని చేస్తోంది. బాషా నాడు కాంగ్రెస్ సీనియర్ నేత... ఎన్జీ రంగా ను గుంటూరు లోక్ సభ స్థానం నుండి ఓడించారు. ఆ తరువాత టీడీపీ పాలిట్ బ్యూరో మెంబర్ గా..చంద్రబాబుకు సన్నిహితుడుగా వ్యవహరించారు.

Recommended Video

    TDP Senior Minorty Leader Ziauddin Joined In YSRCP In Presence Of CM | Oneindia Telugu

    కాగా, ఆ తరువాతి కాలంలో బాషా రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన సోదరుడు ఎస్ ఎం జియవుద్దీన్ గుంటూరు -1 నుంచి రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 24 ఏళ్లకే జియావుద్దీన్ శాసనసభలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత వరుసగా రెండు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే...2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు గెలుపొందారు. అయితే, పార్టీలో సీనియర్ గా ఉన్న జియాఉద్దీన్ కు 2014,2019 లలో టీడీపీ టిక్కెట్ దక్కలేదు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో సైతం పార్టీ అభ్యర్ధి కోసం జియావుద్దీన్ పని చేసారు.

    TDP senior minorty leader Ziauddin joined in YSRCP in CM presence

    2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జియావుద్దీన్ కు మైనారిటీ కమిషన్ చైర్మన్‌గా అవకాశం కల్పించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సైతం కొద్ది కాలం పాటు ఆయన ఆ బాధ్యతల్లో కంటిన్యూ అయ్యారు. కొద్ది రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన జియావుద్దీన్ ఈ రోజు ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలో చేరారు. ప్రస్తుత గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా... ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఇద్దరూ జియావుద్దీన్ ను సీఎం వద్దకు తీసుకెళ్లారు. కాగా, పార్టీ కోసం పని చేస్తానని జియవుద్దీన్ చెప్పుకొచ్చారు. గతంలో వైఎస్సార్ హయాంలోనే ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిన విషయాన్ని జియా ఉద్దీన్ గుర్తు చేసారు. జగన్ నాయకత్వంలో తనకు ఏ బాధ్యత అప్పగించిన నిర్వర్తిస్తానని ఆయన స్పష్టం చేసారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+