కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

20 మంది: వైసీపీ దుష్ప్రచారానికి చెక్ చెప్పేందుకు టీడీపీ 'సైన్యం' సిద్ధం

|
Google Oneindia TeluguNews

కడప: ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీపై చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియా సైన్యం ఏర్పాటు అవుతోంది. ఈ మేరకు మంత్రి, కడప జిల్లా నేత ఆదినారాయణ రెడ్డి ఆదివారం వెల్లడించారు. వైసీపీ మోసపూరిత కుట్రలు ఇక సాగవన్నారు.

తెలుగుదేశం సైన్యంగా ఏర్పడ్డ యువత ప్రతిపక్షాన్ని తగిన రీతిలో ఎదుర్కొంటుందని ఆయన చెప్పారు. కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఓ రెసిడెన్సీలో ఆదివారం టీడీపీ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ బ్రహ్మయ్య, రీజినల్ కో ఆర్డినేటర్ నందకిషోర్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించారు.

ఫేస్‌బుక్, ట్విట్టర్ వినియోగంపై మెలకువలు

ఫేస్‌బుక్, ట్విట్టర్ వినియోగంపై మెలకువలు

ఈ వర్క్ షాప్‌లో పార్టీ మండల అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు, యువకులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన వారికి కన్వీనర్, కో ఆర్డినేటర్ సహా చెన్నై టీడీపీ ఫోరం, బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులు ఫేస్‌బుక్, ట్విట్టర్ల వినియోగంపై మెలకువలు నేర్పించారు.

జగన్ డబుల్ ప్లాన్, మోడీకి నేనెందుకు భయపడతా: బాబు, ఫోన్‌తో టీడీపీ యూటర్న్, మారిన వ్యూహంజగన్ డబుల్ ప్లాన్, మోడీకి నేనెందుకు భయపడతా: బాబు, ఫోన్‌తో టీడీపీ యూటర్న్, మారిన వ్యూహం

ప్రతిపక్షాల చెడు ప్రచారం తిప్పికొట్టాలి

ప్రతిపక్షాల చెడు ప్రచారం తిప్పికొట్టాలి

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. ప్రతి నియోజకవర్గానికి ఒక జట్టును ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ప్రతిపక్షాల చెడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు. టీడీపీ సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ముమ్మరంగా ప్రచారం చేయాలన్నారు.

నాకు గౌరవం ఇవ్వలేదు, ఉద్ధవ్‌తో మాట్లాడానా: మోడీపై బాబు ఆగ్రహం, ఇంకా ఓపికా.. సుజనకు నిలదీతనాకు గౌరవం ఇవ్వలేదు, ఉద్ధవ్‌తో మాట్లాడానా: మోడీపై బాబు ఆగ్రహం, ఇంకా ఓపికా.. సుజనకు నిలదీత

ఒక్కో నియోజకవర్గానికి ఇరవై మంది

ఒక్కో నియోజకవర్గానికి ఇరవై మంది

మంత్రి నారా లోకేష్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త, నాయకులు సోషల్ మీడియా పైన అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఒక్కో నియోజకవర్గానికి 20 మందిని సోషల్ మీడియా ప్రతినిధులుగా ఎంపిక చేస్తున్నామని చెప్పారు. ఎంపికైన వారికి తిరిగి జిల్లా స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

ఇప్పుడు కడప జిల్లాలో

ఇప్పుడు కడప జిల్లాలో

బ్రహ్మయ్య మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది వేలమందిని ఎంపిక చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 12 జిల్లాల్లో వర్క్ షాప్ పూర్తయిందని చెప్పారు. ఇప్పుడు కడప జిల్లాలో నిర్వహించామన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

English summary
Telugudesam Party social media team to face YSR Congress Party. TDP work shop held in Kadapa on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X