విదేశాల్లో రూ.1000 కోట్ల ఆస్తులు: వైసిపికి సోమిరెడ్డి సవాల్, కడపలో టిడిపి ఫస్ట్.. అందుకే
తనకు రూ.1000 కోట్ల ఆస్తులు ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డికి సవాల్ విసిరారు.
విజయవాడ: తనకు రూ.1000 కోట్ల ఆస్తులు ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డికి సవాల్ విసిరారు.
కాకాని, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పైన 420 కేసులు ఉన్నాయని, తన పైన, చంద్రబాబు పైన ఎలాంటి కేసులు లేవన్నారు. దమ్ముంటే తన పైన ఆరోపణలను వైసిపి నేతలు నిరూపించాలని సవాల్ చేశారు. టిడిపి సభ్యత్వ నమోదులో కడప జిల్లాకు మొదటి స్థానం వచ్చిందని, దీనిని వైసిపి జీర్ణించుకోలేకపోతోందని అభిప్రాయపడ్డారు.

తనకు విదేశాల్లో అక్రమాస్తులు ఉన్నాయని వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తమన్నారు. వైసిపి అధినేత జగన్, కాకాని గోవర్థన్‌కు భారీగా అక్రమాస్తులు ఉన్నాయని ఆరోపించారు. తాను విదేశాలకు వ్యక్తిగత పనుల కోసం వెళ్లలేదని, ప్రభుత్వం తరపున వెళ్లానని వివరణ ఇచ్చారు.
ఎమ్మెల్సీ సోమిరెడ్డికి విదేశాల్లో భారీస్థాయిలో అక్రమాస్తులు ఉన్నాయని నెల్లూరు వైసిపి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. ఆయన కుటుంబ సభ్యుల పేరిట సింగపూర్, మలేషియా, హాంకాంగ్ దేశాల్లో ఆస్తులు కొనుగోలు చేశారని, అక్కడి క్లబుల్లో సోమిరెడ్డికి సభ్యత్వం ఉందని కాకాని ఆరోపించారు.












Click it and Unblock the Notifications