• search

ఢిల్లీ వేదికగా టీడీపీ సమరభేరి: ధర్నాకు అశోక్, సుజనా డుమ్మా

By Nageshwara Rao
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీల మధ్య చిచ్చు పెట్టింది. రాజ్యసభలో జరిగిన చర్చలో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేమని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చిసేసిన సంగతి తెలిసిందే.

  ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో హాట్ టాపిక్ కానుంది. ఈ అంశంపై ప్రతిపక్షం నుంచే కాకుండా మిత్రపక్షమైన టీడీపీ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం నిరసనలు ఎదుర్కోబోతోంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో నిన్నటిదాకా చర్చోపచర్చలు జరగగా, ఇకపై నిరసనలు హోరెత్తనున్నాయి.

  అధికార ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ సోమవారం ఉభయసభల్లో నిరసన తెలపాలని నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీలో ఈరోజు ఉదయం 9.30 గంటలకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఈ సమావేశంలో సభలోకి ప్రత్యేకహోదా అంశాన్ని ఎలా తీసుకెళ్లాలనే దానిపై చర్చించారు.

  ఇందులో భాగంగా సోమవారం ఉదయం 10.30 గంటలకు సభ ప్రారంభానికి ముందే పార్లమెంట్‌లో ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ఎంపీలంతా ధర్నా నిర్వహించారు. ఏపీకి ప్రత్యేకహోదా, రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు చేతబట్టి ఆందోళన నిర్వహించారు. రాజ్యసభ సాక్షిగా వెంకయ్య, జైట్లీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి వారు డిమాండ్ చేశారు.

  సమావేశంలో పాల్గొన్న మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి మినహా ఎంపీలంతా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ లోక్‌సభలో వైసీపీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. మరోవైపు టీడీపీ ఎంపీలు కూడా వాయిదా తీర్మానాన్ని ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు.

  ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి తెలుగుదేశం పార్టీని కూడా పార్లమెంట్ అధికార పార్టీగానే గుర్తిస్తారు. అయితే అధికార పార్టీ వాయిదా తీర్మానం ఇవ్వడం చరిత్రలో చాలా అరుదు. టీడీపీ లోకసభాపక్ష నాయకుడు తోట నరసింహం ఈ నోటీసుని ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం (ఆగస్టు 5)న లోక్‌సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు.

  అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును తీవ్ర అసంతృప్తికి గురి చేశాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలు, పార్టీ సీనియర్లతో చంద్రబాబు ఆదివారం విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి హోదా దక్కేదాకా పోరు బాట సాగించాల్సిందేనని ఎంపీలకు చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు.

  ఏపీకి ప్రత్యేకరోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును బీజేపీ సమర్థంగా తిప్పికొట్టిన నేపథ్యంలో ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ఆందోళన బాట పట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది.

  ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ కోరుతూ కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి, టీడీపీ ఎంపీలు లేఖ రాశారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్‌పై ఇంకా స్పష్టత రాలేదు. ఏపీకి హోదా విషయంలో కేంద్రం తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

  ఆదివారం జరిగిన సమావేశంలో ఘాటుగా స్పందించారు. తనకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కొడుకు చెప్పినా విననని సీఎం వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రివర్గం నుంచి బయటికొచ్చే అంశంపై ప్రధాని స్పందనను బట్టి ఆలోచిద్దామన్నారు.

   ఢిల్లీ వేదికగా టీడీపీ సమరభేరి: ఎంపీల ధర్నా, వైసీపీ వాయిదా తీర్మానం

  ఢిల్లీ వేదికగా టీడీపీ సమరభేరి: ఎంపీల ధర్నా, వైసీపీ వాయిదా తీర్మానం

  ప్రధాని కలిసి హోదా అంశంపై వివరించాక కూడా రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదని, కొన్ని రోజులు చూశాక తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతాదామని అన్నారు. ప్రధాని మోడీ ఎన్నికల సభల్లో ఏపీకి ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించే బాధ్యత తనదని హామీ ఇచ్చారని అన్నారు.

   ఢిల్లీ వేదికగా టీడీపీ సమరభేరి: ఎంపీల ధర్నా, వైసీపీ వాయిదా తీర్మానం

  ఢిల్లీ వేదికగా టీడీపీ సమరభేరి: ఎంపీల ధర్నా, వైసీపీ వాయిదా తీర్మానం

  ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఉండాలని కోరింది కూడా బీజేపీయేనని చంద్రబాబు వారి మాటలను వారికే వినిపిద్దామని సహచరులతో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నుంచి బయటకు రావాలన్న ప్రతిపాదనపైనా సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది.

   ఢిల్లీ వేదికగా టీడీపీ సమరభేరి: ఎంపీల ధర్నా, వైసీపీ వాయిదా తీర్మానం

  ఢిల్లీ వేదికగా టీడీపీ సమరభేరి: ఎంపీల ధర్నా, వైసీపీ వాయిదా తీర్మానం

  'మీరు ఆదేశిస్తే ఇప్పటికిప్పుడే రాజీనామా చేస్తా. ఇక్కడి నుంచే రాష్ట్రపతికి రాజీనామా లేఖ ఫ్యాక్స్‌ చేస్తా. రేపే వెళ్లి ఆమోదించుకుని వస్తా. ఇదేదో మాట వరసకు చెప్పడం లేదు. మనస్ఫూర్తిగా చెబుతున్నా' అని అశోక్‌ గజపతిరాజు పేర్కొన్నారు. సుజనా చౌదరి కూడా పార్టీ నిర్ణయిస్తే ఇప్పటికిప్పుడే రాజీనామా చేస్తానన్నారు.

   ఢిల్లీ వేదికగా టీడీపీ సమరభేరి: ఎంపీల ధర్నా, వైసీపీ వాయిదా తీర్మానం

  ఢిల్లీ వేదికగా టీడీపీ సమరభేరి: ఎంపీల ధర్నా, వైసీపీ వాయిదా తీర్మానం


  దీంతో చంద్రబాబు స్పందిస్తూ 'ఎన్డీయే నుంచి బయటకు రావడం రెండు నిమిషాల పని. అయితే ఒకసారి అన్ని విషయాలు ప్రధాని మోడీని కలిసి వివరించండి. ఆయన దృష్టిపెడితే రెండు గంటల్లో అన్నీ పరిష్కారం అవుతాయి. ఆయన స్పందించనప్పుడు ఏం చేయాలో చెబుతా' అని చంద్రబాబు అన్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The centre could face protests from its own ally the TDP at a time when it is trying to pass the GST bill in parliament. Angry at the centre's inaction over the demand for special status for Andhra Pradesh, TDP MPs will be protesting at the Gandhi statue in parliament today.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more