కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెంగల్రాయుడు జగన్ కాదని టిడిపిలోకి ఇలా, వైసిపికి చెక్ పెట్టేనా?

చెంగల్రాయుడు కాంగ్రెస్ పార్టీ నుండి ఇటీవలే టిడిపిలో చేరారు. టిడిపిలో చేరడానికి ముందే ఆయనను జగన్ తమ పార్టీలోకి ఆహ్వనించారు.అయితే జగన్ పార్టీ ఆహ్వానాన్ని కాదని చెంగల్రాయుడు టిడిపి లో చేరారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:చెంగల్రాయుడు కాంగ్రెస్ పార్టీ నుండి ఇటీవలే ఆయన టిడిపిలో చేరారు.అయితే టిడిపిలో చేరడానికి ముందే ఆయనకు వైఎస్ఆర్ సి పి లో చేరాలని వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ నుండి ఆహ్వనం వచ్చింది.అయితే ఈ ఆహ్వానాన్ని కూడ చెంగల్రాయుడు సున్నితంగా తిరస్కరించారు. టిడిపిలో చేరడానికి తాను ఏ రకంగా వ్యవహరించానో చెంగల్రాయుడు పూసగుచ్చినట్టు వివరించారు.టిడిపి అధినేత చంద్రబాబు కూడ అందరూ కూడ చెంగల్రాయుడును ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు.

కడప జిల్లాలో టిడిపిని బలోపేతం చేసేందుకుగాను ఆ పార్టీ నాయకత్వం కృషి చేస్తోంది. స్థానిక సంస్థల ఎంఏల్ సి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని ఆ పార్టీ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తోంది.

కడప జిల్లాలో ప్రస్తుతం వైఎస్ఆర్ సిపి అధిపత్యాన్ని దెబ్బకొట్టేందుకుగాను టిడిపి ప్రయత్నాలను చేస్తోంది. వైఎస్ఆర్ సిపికి చెందిన నాయకులతో పాటు ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను కూడ తమ పార్టీలోకి వచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది.

కాంగ్రెస్ పార్టీ వాణిని బలంగా విన్పించే ఎంఏల్ సి చెంగల్రాయుడు పార్టీని వీడడం ఆ పార్టీకి నష్టమే.అయితే రైల్వే కోడూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బలమైన నాయుడుగా చెంగల్రాయుడు ఉన్నారు.అయితే ఈ నేపథ్యంలో చెంగల్రాయుడు టిడిపిలో చేరడంతో ఆ పార్టీకి మరింత ఉత్సాహంలో ఉంది. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి విజయం సాధిస్తారని ఆ పార్టీ విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.

వైఎస్ఆర్ సిపికి కడప జిల్లాలో చెక్ పెట్టేందుకు టిడిపి ప్లాన్

వైఎస్ఆర్ సిపికి కడప జిల్లాలో చెక్ పెట్టేందుకు టిడిపి ప్లాన్

కడప జిల్లాలో వైఎస్ఆర్ సిపికి చెక్ పెట్టేందకుగాను టిడిపి వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. వలసలను ప్రోత్సహిస్తోంది టిడిపి. స్థానిక సంస్థల ఎంఏల్ సి ఎన్నికల్లో తమ అభ్యర్థి రవీంద్రను గెలిపించేందుకు వ్యూహత్మకంగా ఆ పార్టీ అడుగులు వేస్తోంది.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి స్థానిక సంస్థల ఎంఏల్ సి అభ్యర్థిగా వైఎస్ వివేకానంద రెడ్డి బరిలో నిలిచారు.అయితే కడప జిల్లాలో వైఎస్ఆర్ సిపి బలంగా ఉంది. ఆ పార్టీని దెబ్బతీసేందుకు టిడిపి ప్లాన్ చేస్తోంది.

కడప ప్రజాప్రతినిధులతో టిడిపి చీఫ్ సమావేశం

కడప ప్రజాప్రతినిధులతో టిడిపి చీఫ్ సమావేశం

కడప జిల్లాలో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని బాబు పార్టీ నాయకులకు సూచించారు. పార్టీ అభ్యర్థఇని గెలిపించుకొనేలా టిడిపి అధినాయకత్వం వ్యూహచన చేస్తోంది. ఈ మేరకు అన్ని రకాల అవకాశాలను టిడిపి నాయకత్వం ఉపయోగించుకొంటుంది.

జగన్ తో చెంగల్రాయుడు ఎందుకు సమావేశమయ్యారు

జగన్ తో చెంగల్రాయుడు ఎందుకు సమావేశమయ్యారు

టిడిపిలో చేరడానికి ముందే చెంగల్రాయుడు వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ తో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీని వీడాలని చెంగల్రాయుడు నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో చెంగల్రాయుడును వైఎస్ఆర్ సిపిలో చేరాలని ఆ పార్టీ అధినేత జగన్ ఆహ్వనించారు. అయితే చెంగల్రాయుడు టిడిపిలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. టిడిపి అధినేత చంద్రబాబును కలవడానికి ముందే చెంగల్రాయుడు జగన్ ను కలిశారు.అయితే తాను టిడిపిలో చేరాలని నిర్ణయించుకొన్న విషయాన్ని జగన్ కు చెప్పారు. తనపై విశ్వాసం ఉంచి ఆహ్వనించినందుకు ఆయన జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.

అనుచరులను చెంగల్రాయుడు ఒప్పించాడిలా

అనుచరులను చెంగల్రాయుడు ఒప్పించాడిలా

రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన చెంగల్రాయుడు తన అనుచరులతో సమావేశమయ్యారు. టిడిపిలో చేరడానికి దారితీసిన పరిస్థితులను ఆయన తన అనుచరులకు వివరించారు. టిడిపిలో చేరితే నియోజకవర్గ అభివృద్దికి ఏ రకంగా తోడ్పాటు ఉంటుందో వివరించారు.తనతో పాటుగా అనుచరులను టిడిపిలో చేరేలా చెంగల్రాయుడు ఒప్పించారు.

సిఎం రమేష్ చక్రం తిప్పాడిలా

సిఎం రమేష్ చక్రం తిప్పాడిలా

కడప జిల్లాలో తన అనుచరుడు రవీంద్రను స్థానిక సంస్థల ఎంఏల్ సి ఎన్నికల్లో గెలిపించుకొనేందుకుగాను టిడిపి ఎంపి సిఎం రమేష్ చక్రం తిప్పుతున్నారు. ఇతర పార్టీలకు చెందిన కీలకనేతలను కలిసి టిడిపి అభ్యర్థికి మద్దతివ్వాలని కోరుతున్నారు. సిఎం. ఎం వి మైసూరా రెడ్డిని కలిసి తమ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వాలని కోరారు. మరో వైపు ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నాయకులను కూడ కోరారు. మరో వైపు మంత్రి గంటా శ్రీనివాస్ రావుతో కలిసి టిడిపి అభ్యర్థి విజయం కోసం ప్లాన్ చేస్తున్నాడు సిఎం రమేష్ .

English summary
tdp strategies for mlc win in kadapa district.tdp mp c.m ramesh and minister ganta srinivasa rao plan for mlc elections,chengala rayudu joined from congress in tdp.chengala rayudu refused ys jagan offer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X