హవాలా బాలినేని అవినీతి చిట్టా; టీడీపీ ఎమ్మెల్యే ఇంటిపై దాడియత్నంతో తెలుగుతమ్ముళ్ళ రచ్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. జగన్ రెడ్డి అక్రమ సంపాదనను రాష్ట్రం దాటిస్తూ చెన్నైలో అడ్డంగా దొరికిపోయిన "హవాలా మంత్రి"అవినీతి చిట్టా ఇది అంటూ బాలినేని అవినీతి చిట్టా బయటపెట్టిన తెలుగుదేశం పార్టీ నేతలు, ఇన్ని అక్రమాలు చేయబట్టే మంత్రి పదవి దక్కింది అంటూ విమర్శలు గుప్పించారు.2019 ఎన్నికల అఫిడవిట్ లో తనకు సొంత కారు కూడా లేదని చెప్పిన బాలినేని 5 కోట్లకు ప్రైవేటు విమానం బుక్ చేసుకుని రష్యా వెళ్లగలిగారని, అంతగా అవినీతి చేశారంటూ ఆరోపణలు గుప్పించారు.

టీడీపీ ఎమ్మెల్యే ఇంటిపై దాడికి యత్నం .. ఖడించిన చంద్రబాబు

టీడీపీ ఎమ్మెల్యే ఇంటిపై దాడికి యత్నం .. ఖడించిన చంద్రబాబు


ఇక దీంతో బాలినేని అవినీతిపై మాట్లాడిన కొండపి ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నం చేశారు. బాలాంజనేయ స్వామి ఇంటిపై దాడికి ప్రయత్నం చేసిన వైసిపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనపై కొండపి ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామితో టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ఎమ్మెల్యే స్వామి ఇంటిపై వైసిపి మూకలు దాడి ప్రయత్నంపై ఫోన్ ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న చంద్రబాబు ఎమ్మెల్యే ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించారు.

 మంత్రి బాలినేని అవినీతిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? చంద్రబాబు ప్రశ్న

మంత్రి బాలినేని అవినీతిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? చంద్రబాబు ప్రశ్న


మంత్రి బాలినేని అవినీతిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు చంద్రబాబు . వైసిపి బెదిరింపులకు భయపడాల్సిన పని లేదని బాల వీరాంజనేయ స్వామి కి చంద్రబాబు సూచించారు. ప్రజల పక్షాన పోరాటం సాగిస్తున్న టిడిపి నేతలను వైసిపి దాడులతో భయపెట్టాలని చూస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నేతలకు పార్టీ అండగా ఉంటుందని చెప్పిన చంద్రబాబు వైసీపీ బెదిరింపులకు భయపడ వద్దంటూ సూచించారు.

వైసీపీ లీడర్ నుంచి కేడర్ దాకా ఓటమి భయం.. అందుకే దాడులు: అచ్చెన్న

వైసీపీ లీడర్ నుంచి కేడర్ దాకా ఓటమి భయం.. అందుకే దాడులు: అచ్చెన్న


ఇదిలా ఉంటే టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు టిడిపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఇంటి పై వైసీపీ కార్యకర్తల దాడి యత్నం హేయమని మండిపడ్డారు. బాలినేని శ్రీనివాస రెడ్డి అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తే తప్పా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. వైసిపి అరాచక పాలన పై ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం దాడులకు తెగబడుతున్నారు అని మండిపడ్డారు. వైసీపీ లీడర్ నుంచి కేడర్ వరకు ప్రతి ఒక్కరికి ఓటమి భయం పట్టుకుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వైసీపీ నేతల అక్రమాలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించిన ఆయన, మూడేళ్లుగా అంగుళం కూడా అభివృద్ధి చేయని వైసీపీ నేతలను ఆ పార్టీ కేడర్ ప్రశ్నించాలి అంటూ వ్యాఖ్యానించారు.

హవాలా బాలినేని దాదాగిరి కి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది: లోకేష్

హవాలా బాలినేని దాదాగిరి కి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది: లోకేష్

టిడిపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఇంటి పై వైసిపి కార్యకర్తలు దాడికి ప్రయత్నం చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలినేని అవినీతిని ప్రశ్నిస్తే విద్యావంతులు, దళిత మేధావి, ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఇంటి పై రౌడీ మూకలను పంపుతావా అంటూ ప్రశ్నించారు. మా ఎమ్మెల్యే జోలికొస్తే ఖబడ్దార్ అంటూ లోకేష్ హెచ్చరించారు. హవాలా బాలినేని దాదాగిరి కి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిందని లోకేష్ పేర్కొన్నారు. అవినీతి చీడ పురుగు ఆయన నీకే అంత పౌరుషం ఉంటే, నిజాయితీపరుడైన ఎమ్మెల్యే స్వామికి ఇంకెంత పౌరుషం ఉండాలని ప్రశ్నించారు. బాల వీరాంజనేయ స్వామి ఇంటి పైకి వచ్చిన మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదని లోకేష్ పేర్కొన్నారు.

 మంత్రి బాలినేని అవినీతిపై ప్రభుత్వం విచారణ జరిపించాలి: ఎమ్మెల్యే స్వామి డిమాండ్

మంత్రి బాలినేని అవినీతిపై ప్రభుత్వం విచారణ జరిపించాలి: ఎమ్మెల్యే స్వామి డిమాండ్


ఇక మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అవినీతిపై ఆరోపణలు చేస్తే దాడులకు తెగబడుతున్నారు అని ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బాలినేని అవినీతిపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదని ఆయన తెలిపారు. మంత్రి బాలినేని అవినీతిపై ప్రభుత్వం విచారణ జరిపించాలంటూ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు. వైసీపీ నేతల రౌడీయిజానికి భయపడబోమని ఆయన తేల్చి చెప్పారు. వైసిపి అరాచకాలను తిప్పి కొడతామని బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+