వైసీపీకి షాకిచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్ ... స్వగ్రామంలో టీడీపీ ఖాతాలో ఏకగ్రీవం, మాధవ్ మద్దతు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మొన్నటికి మొన్న పంచాయతీ తొలి విడత ఎన్నికల పోలింగ్ లో పలు ఆసక్తికర ఏకగ్రీవాలు, ఎన్నికలు చోటుచేసుకోగా తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. హిందూపూర్ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు ఆయన స్వగ్రామంలోనే ఇబ్బందికర పరిణామం ఎదురయింది. తనకు ఎదురు లేదు అని మీసం మెలిపెట్టే గోరంట్ల మాధవ్ టీడీపీ బలపరిచిన అభ్యర్థిని ఒప్పుకోవాల్సి వచ్చింది .
ఎన్నికల సిత్రాలు .. గౌను వేసుకుని ఎన్నికల ప్రచారం చేసిన అభ్యర్థి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కర్నూలు జిల్లా రుద్రవరం గ్రామంలో పంచాయతీ సర్పంచ్ పదవిని టిడిపి మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. టిడిపి మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఎంకే మధు ను ఆ గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టిడిపి బలపరిచిన ఎంకే మధు గోరంట్ల మాధవ్ కు దగ్గరి బంధువు కూడా అవుతారు. దీంతో మాధవ్ సైతం మధు కు మద్దతు ఇచ్చినట్లుగా సమాచారం.

అయితే టిడిపి బలపరిచిన అభ్యర్థికి గోరంట్ల మాధవ్ మద్దతు ఇవ్వడంపై వైసీపీలో తీవ్ర చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం. వైసిపి బలపరిచిన అభ్యర్థిని కాకుండా టిడిపి బలపరిచిన అభ్యర్థి, సమీప బంధువు అంటూ మద్దతు ఇవ్వడం పై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా తన బంధువు సర్పంచ్ అయ్యారన్న విషయం పక్కన పెడితే, టిడిపి బలపరిచిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అన్నది ఒకరకంగా గోరంట్ల మాధవ్ కు ఇబ్బందికర పరిణామమనే చెప్పాలి.