వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మండ‌లిలో బిజెపి వ‌ర్సెస్ టిడిపి : తీర్మాన కాపీలు చింపివేత...!

|
Google Oneindia TeluguNews

ఏపి శాస‌న‌స‌భ‌లో కొత్త దృశ్యం క‌నిపించింది. టిడిపి వ‌ర్సెస్ బిజెపి అన్న‌ట్లు గా స‌భ్యులు త‌ల ప‌డ్డారు. ఏపికి అన్యాయం పై అధికార పార్టీ టిడిపి ఓ తీర్మానం ప్ర‌వేశ పెట్టింది. దీనికి బిజెపి స‌భ్యులు అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. స‌భ‌లో ప్ర‌వేశ పెట్టిన తీర్మాన కాపీల‌ను చింపేశారు. దీని పై టిడిపి స‌భ్యులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.

బిజెపి వర్సెస్ టిడిపి..
శాన‌స స‌భ‌లోనూ..శాస‌న మండలిలోనూ ఏపికి కేంద్ర సాయం పై చ‌ర్చ జ‌రిగింది. రెండు స‌భ‌ల్లోనూ బిజెపి నేత‌లు టిడిపి తీరును త‌ప్పు బ‌ట్టారు. శాస‌న‌స‌భ‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బిజెపి ప‌క్ష నేత విష్ణు కుమార్ రాజు పై ఫైర్ అయ్యారు. ఏపికి కేంద్రం చెప్పిన దాని కంటే ఎక్క‌వ‌గానే చేసింద‌ని..ముఖ్య‌మంత్రి హోదా విష‌యంలో యూ ట‌ర్న్ తీసుకుంద‌ని విష్ణు కుమార్ రాజు చెప్పుకొచ్చారు. జోక్యం చేసుకున్న ముఖ్య‌మంత్రి బిజెపి తీరు పై తీవ్రంగా స్పందిం చారు. ఏపి పై వివ‌క్ష చూపిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ముఖ్య‌మంత్రి ఒక్క‌సారిగా సీరియ‌స్ అవ్వ‌టంతో స‌భ‌లో ప‌రిస్థితు లు హీటెక్కాయి. ఏపి కి ఏ విధంగా అన్యాయం జ‌రుగుతుందీ.. తాను ప్ర‌ధాని మోదీతో ఏ ర‌కంగా వ్య‌వ‌హ‌రించిందీ సీయం వివరించారు. అనంత‌రం స‌భ‌లో కేంద్ర తీను ను నిర‌సిస్తూ తీర్మానం చేసారు.

TDP vs BJP members war in Council : portest on resolution

మండ‌లిలో పోడియం వ‌ద్ద‌కు
ఇక శాస‌న మండ‌లిలో సైతం బిజెపి నేత‌లు వ‌ర్సెస్ టిడిపి అన్న‌ట్లు ప‌రిస్థితి మారిపోయింది. కేంద్ర సాయం పై చ‌ర్చ జ‌రుగుత‌న్న స‌మ‌యంలో బిజెపి ఎమ్మెల్సీలు అభ్యంత‌రం వ్యక్తం చేసారు. పోడియం వ‌ద్ద‌కు దూసుకెళ్లారు. పోటీగా టిడిపి ఎమ్మెల్సీలు పోడియం వ‌ద్ద‌కు వ‌చ్చారు. టిడిపి ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వ‌ర ప్ర‌సాద్ బిజెపి ఎమ్మెల్సీల తీరును త‌ప్పు బ‌ట్టారు. ఇక‌, మండ‌లిలో కేంద్ర తీరుకు నిర‌స‌న‌గా తీర్మానం ప్ర‌తిపాదించారు. బిజెపి స‌భ్యులు తీర్మాన కాపీల‌ను చింపేసారు. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ స్పందిస్తూ.. లోపభూయిష్టమైన తీర్మాన కాపీలను మాత్రమేగా ఆరోపిస్తూ చింపేసినట్లు స్పష్టం చేశారు. పోలవరం గూర్చి మాట్లాడే హక్కు ఏపీ చంద్రబాబుకు లేదని మాధవ్ చెప్పుకొచ్చారు. కేంద్రం చొరవతోనే అన్ని ప్రాజెక్ట్‌లు ప్రారంభం అవుతాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులు ఎక్కడ కేంద్ర ప్రభుత్వం తీర్చాల్సిన అవసరం లేదన్నారు.

English summary
dialogue war between TDP and BJP Mlc's in Ap council. TDP proposed a resolution against central govt on Special status implementation. BJP opposed that resolution and protest at podium.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X