తప్పంతా వారిదే!: బీజేపీ రాకతో తలొగ్గిన చంద్రబాబు ప్రభుత్వం (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: బెజవాడలో ఆలయాల కూల్చివేతపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న కృష్ణా పుష్కరాల కోసం బెజవాడ చుట్టుపక్కల ప్రాంతంలోని పలు ఆలయాలను అధికారులు కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ఆలయాల కూల్చివేతను టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంతేకాదు కూల్చివేసిన ఆలయాల ప్రాంతాలను ఆదివారం బీజేపీ నేతలైన సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణలు సందర్శించి ఆలయాల తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వివాదం మరితంగా ముదిరి ఇరు పార్టీల మధ్య అగాథం సృష్టించే అవకాశం ఉందని గ్రహించిన సీఎం చంద్రబాబు ప్రభుతం ఆలయాలను కూల్చివేసిన ప్రాంతాలకు మంత్రులను హుటాహుటిన పంపి వారితో కూల్చిన ఆలయాలను పునర్నిర్మించే చర్యలు చేపడతామని చెప్పించారు.

ఈ మేరకు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వెల్లడించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ విజయవాడ కార్పొరేషన్ అధికారుల అత్యుత్సాహం కారణంగానే విజయవాడలో రహదారుల విస్తరణ వివాదాస్పదం అయిందని అన్నారు.

దేవాలయాలను తొలగించాలన్న ఆలోచన తమకు ఏనాడూ లేదని ఆయ చెప్పుకొచ్చారు. జరిగిన తప్పు ఉద్దేశ పూర్వకంగా జరిగినది కాదని చెప్పిన ఆయన గోశాల, కృష్ణుడి దేవాలయం తొలగింపు, ఆంజనేయుడు, వినాయకుడి గుడుల తొలగింపులో తప్పు జరిగిపోయిందని అన్నారు.

వీటిని పునర్నిర్మించే చర్యలు చేపడతామని తెలిపారు. కృష్ణా పుష్కరాలకు వచ్చే ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని, వారి రాకపోకలకు వీలుగా ఏర్పాట్లు చేయాలన్న సదుద్దేశంతో మాత్రమే అధికారులు విస్తరణ చేపట్టారని, అయితే, సమన్వయలేమి, అత్యుత్సాహంతో తొందర పడ్డారని అన్నారు.

ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ పెద్దల సలహాలు, సూచనలు లేకుండా అధికారులు వారంతట వారుగా ఆక్రమణల తొలగింపు పేరిట దేవాలయాలను కూల్చేంత ధైర్యం చేయగలరా? అన్న ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పకపోవడం విశేషం.

బీజేపీ వ్యతిరేకత, మెట్టుదిగిన చంద్రబాబు ప్రభుత్వం

బీజేపీ వ్యతిరేకత, మెట్టుదిగిన చంద్రబాబు ప్రభుత్వం

ఆదివారం నాడు కన్నా లక్ష్మీనారాయణ సహా పలువురు బీజేపీ నేతలు కూల్చివేసిన ఆలయాల ప్రాంతాలను సందర్శించారు. ఆలయాల తొలగింపు సరికాదని వారు అభిప్రాయపడ్డారు. ఇంద్రకీలాద్రి గోశాల సమీపంలో బీజేపీ నేతలు విలేకరులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో టిడిపి నేత బుద్ధా వెంకన్న, ఆయన అనుచరులు బీజేపీ నేతలను అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ నేతలు, టిడిపి నేతల మధ్య వాగ్వాదం జరిగింది.

బీజేపీ వ్యతిరేకత, మెట్టుదిగిన చంద్రబాబు ప్రభుత్వం

బీజేపీ వ్యతిరేకత, మెట్టుదిగిన చంద్రబాబు ప్రభుత్వం

అర్జున వీధిలోని గోశాల వద్దకు చేరుకుని అక్కడ జరిగిన ధ్వంసాన్ని పరిశీలించి విలేకరులతో మాట్లాడసాగారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడే సమయంలో టీడీపీ నేతలు వచ్చి అడ్డుకున్నారు. గోశాల ఎదురుగానే ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఇళ్లు ఉండడంతో ఆయన తన అనుచరులతో అక్కడికి వచ్చి సోము వీర్రాజు నిర్వహిస్తున్న ప్రెస్‌మీట్‌ను అడ్డుకుని తన వాదన వినిపించబోయారు.

బీజేపీ వ్యతిరేకత, మెట్టుదిగిన చంద్రబాబు ప్రభుత్వం

బీజేపీ వ్యతిరేకత, మెట్టుదిగిన చంద్రబాబు ప్రభుత్వం

తమ అభిప్రాయాలు చెప్పేందుకు ప్రెస్‌మీట్ పెట్టుకుంటే దాన్నెలా అడ్డుకుంటారంటూ వీర్రాజు, కన్నా ప్రశ్నించారు. ఈలోగా బీజేపీ నేతల వెనుక ఉన్న కార్యకర్తలను వెంకన్న వెంట వచ్చిన కార్యకర్తలు తోసివేశారు. బీజేపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. దీంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ప్రెస్‌మీట్ అక్కడ నిర్వహించకూడదంటూ మైక్‌లు లాగేయబోయారు.

బీజేపీ వ్యతిరేకత, మెట్టుదిగిన చంద్రబాబు ప్రభుత్వం

బీజేపీ వ్యతిరేకత, మెట్టుదిగిన చంద్రబాబు ప్రభుత్వం

ఒక దశలో మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్.. బుద్దా వెంకన్న బంధువు, మాజీ కార్పొరేటర్ సంపర రాంబాబుల మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ కార్యకర్తలు నాయకులకు అడ్డుగా నిలబడి ప్రెస్‌మీట్ కొనసాగించాలంటూ పట్టుబట్టారు. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

బీజేపీ వ్యతిరేకత, మెట్టుదిగిన చంద్రబాబు ప్రభుత్వం

బీజేపీ వ్యతిరేకత, మెట్టుదిగిన చంద్రబాబు ప్రభుత్వం

గొడవ గురించి తెలుసుకున్న రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు అక్కడకు రాసాగారు. పరిస్థితి ఉద్రక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలకు సర్దిచెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బీజేపీ నేతలు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ తదితరుల్ని అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ కోరారు. వారిని బలవంతంగా కారు ఎక్కించి పంపించేశారు. బీజేపీ నేతలు వెళ్లిపోగానే అదే ప్రదేశంలో వెంకన్న విలేకరుల సమావేశం నిర్వహించారు.

బీజేపీ వ్యతిరేకత, మెట్టుదిగిన చంద్రబాబు ప్రభుత్వం

బీజేపీ వ్యతిరేకత, మెట్టుదిగిన చంద్రబాబు ప్రభుత్వం

సోము వీర్రాజు మాట్లాడుతూ.. నగరంలో దేవాలయాలు, గోశాలను అడ్డగోలుగా కూల్చివేయడం అమానుషమని, దీన్ని బీజేపీ ఎప్పటికీ సమర్ధించబోదన్నారు. అభివృద్ధికి తాము అడ్డుకాబోమని, అభివృద్ధికి అడ్డువచ్చే దేవాలయాలను వాటి యాజమాన్యాలతో మాట్లాడి ప్రత్యామ్నాయం చూపించిన తరువాత తొలగించాలని సూచించారు.

బీజేపీ వ్యతిరేకత, మెట్టుదిగిన చంద్రబాబు ప్రభుత్వం

బీజేపీ వ్యతిరేకత, మెట్టుదిగిన చంద్రబాబు ప్రభుత్వం

గోశాలకు సంబంధించి 20 రోజులు క్రితం సీఎం సమక్షంలో చేసుకున్న ఒప్పందాన్ని ప్రక్కన పెట్టి రోడ్డుకు విస్తరించారనే విషయం సీఎం దృష్టికి తీసుకువెళ్లి గోశాలకు, దేవాలయాలకు న్యాయం చేయాలని కోరతామన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP Vs BJP over Temples and Goshala Collapse in Vijayawada.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి