ఎమ్మెల్సీ ఫలితాలు, కూటమికి బిగ్ అలర్ట్ - పబ్లిక్ మూడ్ క్లియర్..!!
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. రెండు గ్రాడ్యుయేట్.. ఒక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఒక సీటు కూటమి ఇప్పటికే గెలవగా.. మరో సీటులో గెలుపు దిశగా వెళ్తోంది. అనూహ్యంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ సీటు మాత్రం పీఆర్టీయూ గెలిచింది. కాగా, ఇక్కడ కూటమి రఘువర్మకు మద్దతు ఇచ్చింది. అయినా.. తాము ఓడినట్లు కాదని కూటమి నేతలు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ దూరంగా ఉంది. 2024 లో కూటమి క్లీన్ స్వీప్ చేసిన ఈ జిల్లా ల్లో ఇప్పుడు ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్ ఓటర్లు ఇచ్చిన తీర్పు కూటమికి ఏలాంటి సంకేతాలు ఇచ్చింది. ఈ ఫలితం ఇచ్చిన సందేశం ఏంటి..
ఫలితాలు తేల్చిందేంటి
ఏపీలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు దాదాపు వంద అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగాయి. 2024 లో కూటమి రెండు మినహా ఈ సీట్లలో విజయం సాధించింది. కూటమికి 2024 ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు పాల్గొన్న ఎమ్మెల్సీ ఫలితాలు మాత్రం కూటమికి అలర్ట్ గానే మారుతున్నాయి. ఉపాధ్యాయ నియోజకవర్గంలో టీడీపీ - జనసేన మద్దతు ఇచ్చిన రఘువర్మ ఓడిపోయారు. అయితే, పీఆర్టీయూ అభ్యర్ధి శ్రీనివాసులు నాయుడుకు బీజేపీ మద్దతుగా నిలిచింది. ఇప్పుడు శ్రీనివాసులు నాయుడుకే తాము మద్దతు ఇచ్చామని టీడీపీ నేతలు చెబుతున్నారు. రఘువర్మకు మద్దతుగా టీడీపీ, జనసేన మద్దతుగా ప్రచారం చేసిన వీడియోలను వైసీపీ బయట పెడుతోంది.

రెండు చోట్లు అనుకూలం
గాదె శ్రీనివాసులు నాయుడు మూడోసారి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. గతంలో 2007, 20 13లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మపై రెండో ప్రాధాన్యత ఓట్లతో గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం సాధించారు. ఒట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజాకి 82 వేల 320 ఓట్ల మెజార్టీ వచ్చింది. మొత్తం 9 రౌండ్లలో లక్షా 45 వేల 57 ఓట్లు ఆలపాటి రాజా సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు 62 వేల 737 ఓట్లు సాధించారు. ఇక ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో కూటమి అభ్యర్ధి మెజార్టీ కొనసాగుతోంది.
గోదావరి జిల్లాల్లో
గోదావరి జిల్లాల్లో నాలుగో రౌండు కౌటింగ్ పూర్తయింది. 1,22,000 ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి చెల్లుబాటు అయిన ఓట్లు 1,02,236 కాగా, చెల్లని ఓట్లు 9,764గా ఉన్నాయి. ఇక, ఇక్కడ పోటీలో ఉన్న కూటమి అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖరం 64,405 ఓట్లు వచ్చాయి. అదే విధంగా పిడిఎఫ్ అభ్యర్ధి దిడ్ల వీర రాఘవులు 23,252 ఓట్లు పోలయ్యాయి. ప్రధాన అభ్యర్థులు పేరాబత్తుల రాజశేఖరం దిడ్ల వీర రాఘవులు మధ్య 41,153 ఓట్ల వ్యత్యాసం ఉంది. ఈ ఎన్నిక ల్లో వైసీపీ పోటీకి దూరంగా ఉంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం చంద్రబాబు పలు మార్లు కూటమి నేతలతో సమీక్షలు చేసారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఈ ఫలితాల పైన కూటమి నేతలు విశ్లేషణలు చేస్తున్నారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications