గన్నవరం కోర్టు వద్ద రోజాకు చేదు అనుభవం, రంగంలోకి పోలీసులు
కృష్ణా జిల్లాలోని గన్నవరం కోర్టు వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గన్నవరం కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన రోజాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
విజయవాడ: కృష్ణా జిల్లాలోని గన్నవరం కోర్టు వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గన్నవరం కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన రోజాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

టిడిపి మహిళా కార్యకర్తలు రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో గన్నవరం సివిల్ కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత కనిపించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు టిడిపి కార్యకర్తలను అక్కడి నుంచి తరలించారు.
కాగా, ప్రయివేటు పిటిషన్ పైన విచారణ కోసం రోజా ఈ రోజు కోర్టుకు వచ్చారు. ఇటీవల విజయవాడలో జరిగిన మహిళా పార్లమెంటు సదస్సుకు వెళ్లకుండా అడ్డుకున్నారని పోలీసుల పైన రోజా ప్రయివేటు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఆమె కోర్టుకు వచ్చారు.












Click it and Unblock the Notifications