రోజా ఫోటో ముందు బోరున విలపించిన తెలుగు మహిళలు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తరువాత అధికార ప్రతిపక్ష నేతల మధ్య యుద్ధం మరింత ముదిరింది. చంద్రబాబు అరెస్టు తరువాత ఏపీ మంత్రి రోజా స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకునే విషయం తెలిసిందే. అంతేకాదు చంద్రబాబుని, లోకేష్ ను నిత్యం టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
నారా బ్రాహ్మణిని సైతం వదిలిపెట్టకుండా మంత్రి రోజా టార్గెట్ చేస్తున్నారు. ఇక ఈరోజు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పైన కూడా రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఫ్లూటు జింక ముందు ఊదు మా ముందు కాదంటూ రోజా బాలయ్యను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో తెలుగు దేశం పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు మంత్రి రోజా తీరును వ్యతిరేకిస్తూ రోజాకు శ్రద్ధాంజలి ఘటించారు. టిడిపి మహిళా నేతలు విశాఖలో రోజా ఫోటోకు పూలు పెట్టి, శ్రద్ధాంజలి అని పేర్కొంటూ రోజా ఫోటో ముందు కన్నీరు పెట్టుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు వార్త విని గుండెపోటుతో రోజా చనిపోయిందని టిడిపి మహిళా నేతలు పేర్కొన్నారు.
ఈ వార్త సోషల్ మీడియా ద్వారా తమకు తెలిసిందని తెలుగు మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. మహిళలు అందరూ రోజా ఫోటో ముందు కూర్చుని బోరున విలపించారు. మంత్రి రోజా తీరుకు వినూత్నంగా నిరసన తెలిపిన తెలుగు మహిళలు రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. చంద్రబాబును, లోకేష్, బాలకృష్ణ లను రోజా టార్గెట్ చెయ్యటంపై మండిపడుతున్నారు.
అవినీతి కేసులో జైలుకు వెళ్ళిన ఘనత జగన్ కే ఉందని, చంద్రబాబును కక్ష సాధింపు చర్యలో భాగంగా అరెస్ట్ చేశారని, ఇది కావాలని చేసిన పని అని తెలుగు మహిళలు మండిపడుతున్నారు. అక్రమ కేసులో చంద్రబాబును ఇరికించారని మండిపడ్డారు.వచ్చే ఎన్నికల్లో సైకో జగన్ కు బుద్ధి చెప్తారని మండిపడుతున్నారు. ఇక నగరిలో రోజా పని అయిపోయిందని, రోజాకు రోజులు దగ్గర పడ్డాయని తెలుగు మహిళలు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications