వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'బిజెపితో దోస్తీపై తీవ్ర నిర్ణయం తప్పదు', 'అందుకే కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కలేదు'

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బడ్జెట్‌లో ఏపీ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కేటాయింపుపై ఏపీ రాష్ట్రానికి చెందిన అధికార, విపక్ష పార్టీల ఎంపీలు మంగళవారం నాడు ఆందోళన కొనసాగించారు. విభజన బిల్లులో ఇచ్చిన హమీలు కూడ నెరవేరలేదని ఎంపీలు గుర్తు చేశారు.

బాబును చూస్తే భయం, అందుకే కక్షకట్టారు, సోము వీర్రాజెవరు?: జెసి సంచలనంబాబును చూస్తే భయం, అందుకే కక్షకట్టారు, సోము వీర్రాజెవరు?: జెసి సంచలనం

ఏపీ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడ దక్కలేదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్‌సభలో హెచ్చరించారు.ప్రభుత్వ తీరును నిరసిస్తూ లోక్‌సభ నుండి వైసీపీ వాకౌట్ చేసింది. మరో వైపు మిత్రపక్షంగా ఉన్న తమ పట్ల బిజెపి అనుసరిస్తున్న విధానాలపై తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని టిడిపి ఎంపీ జెసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దుష్టశక్తులున్నాయి, టిడిపి దయతో ఎమ్మెల్సీని కాలేదు: సోము వీర్రాజు సంచలనందుష్టశక్తులున్నాయి, టిడిపి దయతో ఎమ్మెల్సీని కాలేదు: సోము వీర్రాజు సంచలనం

బడ్జెట్‌పై ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో అన్యాయం జరిగిందని లోక్‌సభ, రాజ్యసభలో ఎన్డీఏ మిత్రపక్షం టిడిపి ఆందోళన కొనసాగిస్తోంది. కేంద్ర మంత్రు హమీలిచ్చినా కానీ టిడిపి నేతలు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు.

' వాస్తవాలు టిడిపి నేతలు తట్టుకోవడం లేదు,వారికి ఎందుకు మంత్రిపదవులిచ్చారు'' వాస్తవాలు టిడిపి నేతలు తట్టుకోవడం లేదు,వారికి ఎందుకు మంత్రిపదవులిచ్చారు'

లోక్ సభ, రాజ్యసభల్లో వైసీపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు కూడ తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఏపీకి ఇవ్వాల్సిన నిధులను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ ఆందోళనలతో కేంద్రం ఏ రకంగా స్పందిస్తోందో చూడాలి.

బిజెపిపై తీవ్రమైన నిర్ణయం తీసుకోవాలి

బిజెపిపై తీవ్రమైన నిర్ణయం తీసుకోవాలి


బడ్జెట్‌లో ఏపీకి సరైన కేటాయింపులు లేకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని టిడిపి ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై తమ ఆందోళనలను కొనసాగిస్తున్నట్టు టిడిపి ఎంపీలు చెబుతున్నారు. మిత్రపక్షంగా ఉన్న తమ పట్ల బిజెపి నాయకత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల టిడిపి నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తాము తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మిత్రపక్షంగా తమ అభ్యర్థనను బిజెపి పట్టించుకోవడం లేదని జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఏపీకి అన్యాయం జరిగింది

ఏపీకి అన్యాయం జరిగింది

బడ్జెట్‌ కేటాయింపుల్లో ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని టిడిపి ఎంపీ తోట నర్సింహం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేకుండా ఉన్న విషయాన్ని లోక్ సభలో నరసింహం చెప్పారు. మరో వైపు ఏపీ రాష్ట్రానికి విభజన హమీలను అమలు చేయలేదని నరసింహం చెప్పారు.ఇప్పటివరకు తాము వేచి చూసే ధోరణిని అవలంభించినట్టు నరసింహం గుర్తు చేశారు.

ఏపీలో కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కలేదు

ఏపీలో కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కలేదు

ఏపీ ప్రజలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తిరస్కరించారని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి గుర్తు చేశారు. ఏపీ ప్రజలను అన్యాయానికి గురి చేసిన కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడ దక్కకుండా ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. విశాఖలో పెట్రో కారిడార్ ను ఏర్పాటు చేయాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ కూడ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉందన్నారు.పోలవరం ప్రాజెక్టుపై స్పష్టత లేదన్నారు.రాజధాని కూడ లేని విషయాన్ని మిథున్ రెడ్డి గుర్తు చేశారు.విశాఖలో పెట్రో కారిడార్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.వైసీపీ నుండి టిడిపిలో చేరిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైసీపీ లో‌క్‌సభ నుండి వాకౌట్ చేసింది

మోడీ తన హమీని నెరవేర్చాలి

మోడీ తన హమీని నెరవేర్చాలి

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తిరుపతిలో చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ విభజన చట్టం హామీలను కేంద్రం అమలు చేయాలన్నారు. విభజన చట్టం సవరణకు తాము ప్రతిపాదించిన ప్రైవేట్ బిల్లును..రాజ్యసభ సెక్రటేరియట్ తిప్పిపంపారని కేవీపీ తెలిపారు. ఎన్నికల సమయంలో తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్ధానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.కేంద్రం తీరు వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. అమరావతిలో నూతన రాజధానిని కట్టడానికి కేంద్రం నిధులు ఇవ్వాల్సిందేనని తెలిపారు. విభజన హామీలపై రాజ్యసభలో అడగాలని అనుకున్నా.. సభ వాయిదా పడడం వల్ల అవకాశం రాలేదని సుబ్బరామిరెడ్డి వాపోయారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రభుత్వం, అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హామీ ఇచ్చారని, ఇదే రాజ్యసభలో ఈ మేరకు ఒప్పుకుంటూ ప్రకటనలు చేశారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకొని.. అప్పుడు అమల్లో ఉన్న ప్రణాళిక సంఘానికి సిఫారసు కూడా చేసిందని ఆయన తెలిపారు.

English summary
While TDP MPs called on BJP to follow ‘alliance dharma’, YSRCP MPs took on both the BJP and the TDP for ‘staging drama’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X