కొమ్మినేని తీర్పులో సుప్రీం చెప్పిందేంటి ? అనుకూలంగా మార్చుకుంటున్న టీడీపీ, వైసీపీ..!
ఏపీ రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణిస్తూ సాగిన సాక్షి టీవీ టిబేట్ ను నిర్వహించిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో నిన్న ఎదురుదెబ్బ తగిలింది. ఈ డిబేట్ నిర్వహించారనే కారణంతోనో, ప్యానలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు నవ్వుతూ స్పందించారనే కారణంతోనే కొమ్మినేనిని అరెస్టు చేయడం కుదరదంటూ సుప్రీంకోర్టు ఆయనకు ఊరట కల్పించింది.
అదే సమయంలో సుప్రీంకోర్టు కొమ్మినేనిని విడుదల చేయాలంటూ ఇచ్చిన తీర్పులో చేసిన వ్యాఖ్యలపై రాజకీయాలు మొదలైపోయాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కచ్చితంగా కొమ్మినేనితో పాటు విపక్ష వైసీపీకి ఊరటనిచ్చింది. అయితే అధికార టీడీపీతో పాటు కూటమి పార్టీలు ఈ తీర్పులో అంశాల్ని విడతీసి తమకు అనుకూలమని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా తీర్పులో ఐదో పేరాను ఉదహరిస్తున్నాయి.

టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, సానుభూతిపరులు కొమ్మినేని విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఐదో పేరాను వైరల్ చేస్తున్నాయి. ఇందులో టీవీ డిబేట్లు చేసే పిటిషనర్ తాను స్వయంగా ఎలాంటి పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం కానీ ఇతరుల్ని చేయనివ్వడం కానీ చేయకూడదంటూ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు తీర్పు కొమ్మినేనిని చీవాట్లు పెట్టేలా ఉందని అభివర్ణిస్తున్నాయి.
టీడీపీ అభిమానులు 5వ point ఒక్కటే తిప్పుతున్నారు. అసలు ఆర్డర్ 4వ point లో ఉంది. పిటిషనర్ ఎటువంటి defamatory/deragatory వ్యాఖ్యలు చెయ్యలేదు. అంతే కాదు, లైవ్ టీవీ డిబేట్లో ఒక జర్నలిస్టుగా పాల్గొన్నాడు. ఆయన వాక్ స్వాతంత్ర హక్కుని కాపాడాలి. pic.twitter.com/8vkEnQaNxc
— ChakravarthyNalamotu (@nalamotu) June 13, 2025
మరోవైపు వైసీపీ వర్గాలు మాత్రం ఇదే తీర్పులో నాలుగో పేరాను వైరల్ చేస్తున్నాయి. ఇందులో పిటిషనర్ కొమ్మినేని ఇక్కడ అమరావతిపై పెట్టిన డిబేట్ లో తాను స్వయంగా ఎలాంటి పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయలేదని, కాబట్టి ఆయన భావప్రకటనా స్వేచ్ఛను రక్షించుకునేందుకు అర్హుడని తెలిపింది. కాబట్టి ఆయనపై దాఖలైన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కింది కోర్టును ఆదేశించింది.












Click it and Unblock the Notifications