వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ జోరుపై లెక్కలు: సీమాంధ్రపై బాబు, జగన్ స్కెచ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

TDP and YSRCP strategy to win in Seemandhra
హైదరాబాద్: విభజన, ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు సీమాంధ్రలో గెలుపు వ్యూహాల రచనలో పడ్డాయి. ప్రస్తుతానికి పొత్తుల అంశం పక్కన పెట్టి పార్టీ బలోపేతంపై ఇరు పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ పరిస్థితి అంతంతమాత్రమే అంటున్నారు. మరోవైపు సమైక్యాంధ్ర కోసం చివరి వరకు పోరాడానంటున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభావం అంతంతమాత్రమేనని టిడిపి, జగన్ పార్టీలు భావిస్తున్నాయి.

బహిష్కృత కాంగ్రెస్ ఎంపీలతో కిరణ్ కొత్త పార్టీకి ప్రణాళిక ఖరారు చేస్తున్నారు. అయితే, కిరణ్ పార్టీ పెడితే అందులో లగడపాటి, సబ్బం, హర్ష కుమార్, ఉండవల్లి వంటి కీలక నేతలు చేరుతారు. దీంతో ఆ పార్టీ ప్రభావం ఉంటుందంటున్నారు. ప్రస్తుతం ప్రజల్లో బలమైన క్యాడర్ ఉన్న తెలుగుదేశం కొద్దిగా ముందంజలో ఉందంటున్నారు. బిజెపి పార్లమెంటులో విభజన విషయంలో తమ పట్ల అన్యాయంగా వ్యవహరించదనే ఆగ్రహం సీమాంధ్రలో ఉంది.

దీంతో బిజెపితో పొత్తుకు టిడిపి సాహసించడం లేదు. అయితే, నరేంద్ర మోడీ ప్రభావం ఉంది. దీంతో చివరి నిమిషంలో బిజెపితో టిడిపిపొత్తుపెట్టుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి జనాకర్షణ ఉన్న నేత. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ ఉంది. విభజన నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ నుండి టిడిపితో పాటు జగన్ పార్టీలోకి జోరుగా వలసలు ఉంటున్నాయి. అయితే పార్టీలో విధివిధానాలపై స్పష్టత లేదనే వాదన ఉంది.

సార్వత్రిక ఎన్నికలకు ముందు లేదా తర్వాత తెలుగుదేశం లేదా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలలో ఏదో ఓ పార్టీ బిజెపికి పొత్తు పెట్టుకునే అవకాశం ఉందంటున్నారు. మోడీ ప్రభావం వల్ల నగరాలు, పట్టణాలతో పాటు గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ఓట్లను కొల్లగొట్టవచ్చునని ఇరు పార్టీలు భావిస్తున్నాయి.

English summary

 YSR Congress Party chief YS Jaganmohan Reddy and Telugudesam party chief Nara Chandrababu Naidu are chalking out strategies to win in Seemandhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X