విద్యార్థులకు చెప్పుదెబ్బలు... ఓ టీచరమ్మ నిర్వాకం

తూర్పుగోదావరి జిల్లా : విధ్యార్థులకు విద్యా బుద్దులు నేర్పి సక్రమ మార్గంలో నడపాల్సిన ఉపాధ్యాయులే తప్పుడు మార్గంలో నడుస్తున్నారు. పాఠశాలకు సక్రమంగా రాకపోవడమే కాకుండా విధ్యార్థులను చెప్పులతో కొట్టే ఓ టీచర్ నిర్వాకం తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసింది.ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపారు.

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలంలోని జి .రాగంపేట ప్రభుత్వ పాఠశాలలో విధ్యార్థులను టీచర్ సరోజ చెప్పుతో కొట్టిన ఘటన వెలుగు చూసింది. పలు మార్లు ఇదే రకంగా వ్యవహారిస్తోన్న టీచర్ వ్యవహారశైలిపై స్థానికులు విద్యశాఖాధికారులకు ఫిర్యాదు చేయడంతో విసయం వెలుగు చూసింది

teacher punish students with foot wear, conducted enquiry

టీచర్ నిర్వాకాన్ని పలుమార్లు స్థానిక ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేకపోవడంతో స్థానికులు ఎంఇఓ కు ఫిర్యాదు చేశారు.పాఠశాలకు ఆమె తరచూ డుమ్మా కొట్టేవారని స్థానికులు చెబుతున్నారు. విద్యా కమిటీ చైర్మెన్ ఎంఇఓకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేశారు.

విద్యార్థులను టీచర్ చెప్పుతో కొట్టిన ఘటనపై ఎంఇఓ విచారణ జరిపారు. విధ్యార్థులను చెప్పుతో కొట్టిన విషయం వాస్తవమేనని ఆమె ఒప్పుకొన్నారు.లిఖితపూర్వక సంజాయిషీని కోరినట్టు ఎంఇఓ బాబురావు చెప్పారు.ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారాయన.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+