గురువుకు దేహశుద్ది చేసిన తల్లిదండ్రులు....విద్యార్ధినులతో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఫలితం

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

విద్యార్థులు తప్పుచేస్తే దండించాల్సిన గురువు తన అసభ్య ప్రవర్తన కారణంగా తన్నులు తిన్న ఘటన ఇది. చిత్తూరు జిల్లా వి.కోట మండలం పరిధిలోని ఖాజీపేట ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న తిరుమల ప్రసాద్ విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

విద్యార్థినులతో అసభ్యంగా మాట్లాడటం, తనతో చనువుగా మెలగాలని సూచించడం, వారితో అభ్యంతరకరంగా ప్రవర్తించడం చేస్తున్నట్లుగా విద్యార్ధినులు , వారిని తమ తల్లిదండ్రులకు తెలిపారు. కొంతమంది తల్లిదండ్రులు ఈ విషయమై టీచర్ తిరుమల ప్రసాద్ ను హెచ్చరించినా తీరు మార్చుకోలేదని అంటున్నారు.

Teacher thrashed for indecent behaviour with girls

ఈ నేపథ్యంలో టీచర్ తిరుమలప్రసాద్‌ సోమవారం ఉదయం తరగతి గదిలో మరోసారి విద్యార్ధినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఈసారి అతడి వేధింపులు శృతిమించాయని తెలిసింది. దీంతో విరామ సమయంలో విద్యార్ధినులు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో ఆ తరగతి విద్యార్థినుల సోదరులు మరికొంతమంది స్థానిక యువకులు కలసి పాఠశాల వద్దకు వచ్చి తరగతిగతిలో ఉన్న ఉపాధ్యాయుడు తిరుమల ప్రసాద్ ను బయటకు లాక్కొచ్చి చెట్టుకి కట్టేసి కొట్టారు.

ఈ సమాచారం అందుకున్న ఎస్‌ఐ రవిప్రకాష్ రెడ్డి పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయుడిని విడిపించి జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు టీచర్ తిరుమలప్రసాద్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు డీఈవో ప్రకటించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
some villagers of Khazipeta hamlet in V.Kota mandal on Monday morning thrashed a teacher of a Urdu high school alleging that he had misbehaved with girl students. Some parents stormed the school at noon, dragged out the teacher and beat him up by tying him to a tree.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి