జగన్ తో భారత వికెట్ కీపర్ కేఎస్ భరత్ భేటీ-గ్రేట్ లీడర్, స్ఫూర్తి దాయకమని ప్రశంసలు..

తాజాగా భారత జట్టు ఆస్ట్రేలియాతో ఆడిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆడిన వికెట్ కీపర్, ఏపీకి చెందిన కేఎస్ భరత్ ఇవాళ సీఎం జగన్ తో భేటీ అయ్యాడు. ఇంగ్లండ్ నుంచి తిరిగివచ్చాక భరత్ జగన్ ను క్యాంపు కార్యాలయంలో కలిశాడు. ఈ సందర్భంగా ఇరువురూ పలు అంశాలపై చర్చించుకున్నారు. టీమిండియాలో చోటు సంపాదించే స్ధాయికి వెళ్లడంపై భరత్ ను జగన్ అభినందిస్తే.. జగన్ ను గొప్ప లీడర్ అంటూ భరత్ ప్రశంసించాడు.

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తో ఇవాళ ఇండియన్‌ క్రికెట్‌ ప్లేయర్‌ కేఎస్‌ భరత్‌ (కోన శ్రీకర్‌ భరత్‌) కలిశాడు. ఈ సందర్భంగా టీమిండియా తరఫున ఆడుతున్న కేఎస్‌ భరత్‌ను ముఖ్యమంత్రి జగన్‌ అభినందించారు. టీం సభ్యుల ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీని కేఎస్‌ భరత్‌ సీఎం జగన్ కు బహుకరించాడు. అనంతరం వీరిద్దరూ రాష్ట్రంలో క్రికెట్ పరిస్దితిపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎంతో జరిగిన సమావేశం గురించి కేఎస్‌ భరత్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

 jaganksbharath

జగన్‌ సీఎం అయిన తర్వాత ఇండియన్‌ క్రికెట్‌ టీంకు ఏపీ నుంచి మొదటగా ప్రాతినిధ్యం వహించడం, టెస్ట్‌ కీపర్ గా వ్యవహరించడం తనకు గర్వంగా ఉందని కేఎస్ భరత్ తెలిపాడు. ఈ విషయాలు ఆయనతో పంచుకున్నట్లు వెల్లడించాడు. జగన్ కూడా చాలా సంతోషంగా ఫీలయ్యారన్నాడు. సార్‌ మీరు నాకు ఇన్స్‌పిరేషన్‌గా భావిస్తూ, ఒక క్రికెటర్‌గా మీ మద్దతు నాకు అవసరం అని చెప్పినట్లు భరత్ తెలిపాడు.

సీఎం జగన్ కూడా దేశం గర్వపడేలా, మన రాష్ట్ర పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని తనకు సూచించినట్లు భరత్ వెల్లడించాడు. ఏపీలో మౌలిక వసతులు బాగా పెరుగుతున్నాయని, అలాగే స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ కూడా బావుందని ఈ సందర్భంగా భరత్ తెలిపాడు. క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఒక క్రికెటర్‌గా చాలా బావుందన్నాడు. మున్ముందు ఇలాంటి ప్రోత్సాహం వల్ల నాలాంటి క్రీడాకారులు మరింతగా వెలుగులోకి వస్తారని పేర్కొన్నాడు. ఈ సమావేశంలో కేఎస్‌ భరత్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు మంగాదేవి, శ్రీనివాసరావు, కోచ్‌ క్రిష్ణారావు, కుటుంబ సభ్యులు, ఎంపీ పి.వి.మిథున్‌ రెడ్డి పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+