ఆఫీస్ బిల్డింగ్ పైనుండి దూకి టెక్కీ ఆత్మహత్యాయత్నం

Techie attempts suicide
హైదరాబాద్: తాను పని చేస్తున్న కంపెనీ భవనంపై నుంచి దూకి ఓ సాఫ్టువేర్ ఇంజనీర్ ఆత్మహత్యాయత్నం చేశారు. రాయదుర్గం పోలీసులు వివరాల ప్రకారం... సాయి ఐటి పార్కులోని ఓ సంస్థలో సాఫ్టువేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో అతను తాను పని చేస్తున్న కంపెనీ భవనం పైకి ఎక్కి కిందకు దూకారు.

వాహనంపై పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆయనను తోటి ఉద్యోగులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు.

ఉద్యోగాల పేరుతో టోకరా

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుండి డబ్బు తీసుకోవడమే కాకుండా సెల్ టవర్ల ఏర్పాటుకు స్థలం కావాలంటూ యజమానుల నుంచి ముందస్తు డిడిలు వసూలు చేసి బిచాణా ఎత్తివేసిన సంఘటన హైదరాబాదులో జరిగింది. వసూలు చేసిన మొత్తం రూ.3 కోట్ల మేర ఉంటుందని బాధితులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.

పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ పరిధిలో సిల్వర్ స్టోన్ ఇన్ఫోటెక్ పేరుతో ఓ సంస్థను నెలకొల్పారు. సెల్ ఫోన్ కంపెనీతో సెల్ టవర్లు ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు నమ్మబలికారు. టవర్స్ ఏర్పాటుకు స్థలం అవసరమని, నెల నెల అద్దె చెల్లిస్తామని సుమారు వందమంది యజమానుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. తమ సంస్థ తరఫున ఉద్యోగులు కూడా ఇప్పిస్తామని నిరుద్యోగుల నుండి డబ్బులు తీసుకున్నారు. ఆ తరవాత బిచాణా ఎత్తేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+