ఎంత చెప్పినా..: ప్రేమ పేరుతో మోసం చేసిన టెక్కీ, యువతి ఫిర్యాదు
హైదరాబాద్: ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసిన ఓ సాఫ్టువేర్ ఉద్యోగిని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) పోలీసులు మంగళవారం నాడు అరెస్టు చేశారు. ఎస్సై జానయ్య తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన లావణ్య తన బంధువుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి వచ్చింది.
అక్కడకు వచ్చిన దూరపు బంధువు అయిన సాఫ్టువేర్ ఉద్యోగి అల్లు ఉపేంద్ర (25)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఏడాది నుండి వీరు సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని ఆమెకు అతను పలుమార్లు చెప్పాడు.

తొలుత పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఉపేందర్ ఆ తర్వాత ముఖం చాటేశాడు. లావణ్య తల్లిదండ్రులతో పాటు బంధువులు కూడా పెళ్లి విషయమై అతనితో మాట్లాడారు. అయినప్పటికీ ఉపేంద్ర తగ్గలేదు. దీంతో అతను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో అతను పెళ్లికి అంగీరించాడు. అనంతరం మళ్లీ పేచీ పెట్టాడు. తాను పెళ్లి చేసుకోనని చెప్పాడు. దీంతో లావణ్య తల్లిదండ్రులు మంగళవారం నాడు మరోసారి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు అతని పైన కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications