హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో ఐటి ఉద్యోగి మృతి చెందిన సంఘటన హైదరాబాదులోని గచ్చిబౌలి పోలీసుస్టేషన్ పరిధిలోని జరిగింది. సిఐ జూపల్లి రమేష్‌కుమార్ కథనం ప్రకారం న్యూఢిల్లీకి చెందిన ప్రతీక్ హోరా (23) గచ్చిబౌలిలోని రాజీవ్‌నగర్‌లోని నివాహముంటూ ఫైనాన్‌సిల్ డిస్ట్రిక్‌లోని అమెజాన్ సాఫ్ట్‌వేర్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

జూలై 14న ఆ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరారు. ఆదివారం డ్యూటీకి వచ్చిన ప్రతీక్ విధుల అనంతరం రాత్రి రెస్టు రూములో విశ్రాంతి తీసుకుంటానని వెళ్లాడు. ఉదయం హౌస్‌కీపింగ్ బోయ్ రూము శుభ్రం చేసేందుకు వెళ్లగా ప్రతీక్ మృతి చెంది ఉన్నాడు.

Techie dead in suspicious conditions

నోటినుండి నురగలు, రక్తం వస్తుందని పోలీసులు చెప్పారు. సాధారణ మరణమా లేక ఆత్మహత్య చేసుకున్నాడా తెలుసుకునేందుకు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పని ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్నాడా, రక్తపోటుతో మరణించాడా అనేది తేలాల్సివుంది.

గచ్చిబౌలి ఎస్‌ఐ లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిక్ హోరా కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని వారు వచ్చిన తరువాత పోస్టుమార్టంచేసి మృతదేహాన్ని వారికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

English summary
A software engineer from New Delhi dead at Gachibowli in Hyderabad in suspicious circumstances.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X