ఆర్టీసీ బస్సుకు సడెన్ బ్రేక్, బైక్ ఢీకొట్టి టెక్కీ మృతి

ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న సిస్టమ్స్ ఇంజనీర్ ఎ రాకేష్ (28) తన ద్విచక్ర వాహనంపై పోచారంలోని కార్యాలయానికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. రోడ్డు మీద యూటర్న్ ఉన్న చోట ఎపిఎస్ ఆర్టీసి బస్సుకు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్‌లు వేయడంతో రాకేష్ వాహనం బస్సుకు ఢీకొట్టింది.
రాకేష్ కింద పడి బస్సు కిందికి వెళ్లిపోయాడు. వరంగల్‌కు చెందిన రాకేష్ తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. రాకేష్‌కు పెళ్లి కాలేదు. పోచారంలో ఉండే రాకేష్ నూతన సంవత్సర వేడుకల కోసం ఉప్పల్‌లోని సోదరి ఇంటికి వెళ్లాడు.
రాజేంద్ర నగర్‌లో జరిగిన మరో సంఘటనలో అబ్దుల్ సింగ్ అనే 35 ఏళ్ల వ్యక్తి మరణించాడు. మిత్రులతో కలిసి హోటల్‌లో డిన్నర్‌కు వెళ్తుండగా తాను ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో ప్రమాదం జరిగి అబ్దుల్ సింగ్ అవద్ మరణించాడు. ఆర్టీసి బస్సును దాటబోయే అతను ప్రమాదానికి గురయ్యాడు.












Click it and Unblock the Notifications