టెక్కీ రేప్ కేసు: ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ, సిఎం ఓకే

అభయ లాంటి ఘటనలు పునారవృత్తం కాకుండా ఐటీ ప్రాంతాలతో పాటు మహిళల భద్రతపై ప్రత్యేక కమిటీని నియమించి తక్షణ చర్యలు తీసుకునేవిధంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతిని ఆదేశించారు. అభయ ఘటన తర్వాత కూడా నగరంలో పలు చోట్ల యువతులు పోకీరిల వేధింపులతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని పోలీసులు సీఎంకు వివరించారు.
ఐటి కారిడర్‌లో రాత్రి వేళల్లో పని చేసే మహిళ ఉద్యోగుల భద్రత కోసం ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మహిళల భద్రతపై పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళల రక్షణకు అన్ని విభాగాల సంస్థలు పెద్ద ఎత్తున్న కార్యక్రమాలు, సదస్సులు ఏర్పాటు చేసి అవాగాహన కల్పించాలని సీఎం సూచించారు. హైదరాబాద్‌కు సమగ్ర నిఘా వ్యవస్థ ఏర్పాటుకు గతంలో ప్రధానమంత్రికి రాసిన లేఖకు మరోసారి పీఎంకు రిమైండర్ లేఖను అందించాలని కిరణ్ ఆదేశించారు.
మహిళ భద్రత చర్యలో భాగంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ఐటీ ప్రాంతాల వద్ద పోలీస్ గస్తీ, ఔట్‌పోస్టులు, బారికేడింగ్, వాహనాల తనీఖీలతో పాటు క్యాబ్‌లు, ఆటోలను తనీఖీ చేయాలని పోలీసులను ఆదేశించారు .ప్రీపెయిడ్ ట్యాక్సీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు
ఆర్టీసీ బస్సులను రాత్రి వేళల్లో మహిళలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీకి సూచించారు. ఎంఎంటీఎస్ రైళ్లకు అనుసంధానంగా బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా పరిధిలోని మహిళ వసతి గృహాలను సర్వే, తనీఖీ చేయాలని సీఎం కిరణ్ పోలీసులకు తెలిపారు.
సమీక్షలో రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఆర్ధిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, పాఠశాల విద్యా శాఖ మంత్రి పార్ధసారధి, సాంఘీక సంక్షమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్థి పీకే మహాంతి, డీజీపీ ప్రసాదరావు, ఆర్టీసీ ఎండీ ఎకేఖాన్, జంట పోలీస్ కమిషనర్లు అనురాగ్‌శర్మ, సీవి ఆనంద్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications