బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు
పెయింటింగ్ రంగంలో టెక్నో పెయింట్స్ తనకంటూ ప్రత్యేక ఒరవడిని సృష్టించుకుంది. ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా టీవీ యాడ్ ను మహేష్ ఆవిష్కరించారు. మదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో నమ్రతా శిరోద్కర్, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మేఘా ఇంజనీరింగ్ సంస్థ డైరెక్టర్ బి.శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఫార్చ్యూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాసరెడ్డి టెక్నో పెయింట్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. 22 సంవత్సరాల నుంచి సంస్థ నాణ్యమైన రంగులు, పెయింట్స్ సర్వీసులను ప్రజలకు అందిస్తోందన్నారు. బిజినెస్ టు బిజినెస్ విభాగంలో విజయవంతమయ్యామని, ఏపీ, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా ప్రాజెక్టులను పూర్తిచేశామని చెప్పారు. యూత్ ఐకాన్ గా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ తమ కంపెనీ విస్తరణకు దోహదపడుతుందని భావిస్తున్నామన్నారు.

కలర్ బ్యాంక్స్ ను మల్టీ నేషనల్ కంపెనీలు మాత్రమే ఉపయోగిస్తున్నాయని, తాజాగా తమ టెక్నో పెయింట్స్ ఆధ్వర్యంలో 2వేల షేడ్స్ లో పెయింట్స్ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కొత్తగా మరో వెయ్యి షేడ్లను జోడించబోతున్నామన్నారు. వినియోగదారులకు సకాలంలో పెయింట్లను చేర్చేందుకు 25 డిపోలను ఏర్పాటు చేశామని, పఠాన్ చెరులో 50వేల అడుగుల విస్తీర్ణంలో సెంట్రల్ వేర్ హౌస్ ను ఏర్పాటు చేశామన్నారు. లక్ష మెట్రిక్ టన్నులుగా కంపెనీ వార్షిక సామర్థ్యం ఉందని, 2 లక్షల 50వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని వచ్చే ఏడాది అందుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications