హైదరాబాద్‌లో యువతి శవం: అత్యాచారం, ఆపై హత్య?

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని పాతబస్తీలో గల పహడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలోని కుబానగర్‌లో ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు బుధవారంనాడు గుర్తించారు. కుబానగర్‌లోి నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆ శవం పడి ఉంది. గుర్తించలేని విధంగా మృతదేహం ఉంది.

తొలుత స్థానికులు ఆ మృతదేహాన్ని చూసి, పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలికి దాదాపు 23 ఏళ్ల వయస్సు ఉంటుందని, గుర్తు తెలియని దండగులు ఆమె అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Teenage girl dead body found in Hyderabad

బస్సు స్టేషన్‌లో అనుమానాస్పద వ్యక్తి

హైదరాబాద్ నగరంలోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వ్యక్తి నుంచి తుపాకి, మూడు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వాటర్ ట్యాంకర్ బీభత్సం, బాలుడి మృతి

హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో ఓ వాటర్‌ ట్యాంకర్‌ బీభత్సం సృష్టించింది. బుధవారం పర్వాతానగర్‌ ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపైకి ట్యాంకర్‌ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన జరిగిన వెంటనే వాటర్‌ ట్యాకర్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+