హోంశాఖ వెబ్‌సైట్లో టి బిల్లు: అపాయింటెడ్ డేట్‌పై ఉత్కంఠ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం పొందిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ విభజన బిల్లు గెజిట్‌ను కేంద్ర హోంశాఖ వెబ్ సైట్లో పెట్టారు. ఈ బిల్లు మొత్తం 71 పేజీలు ఉంది. అపాయింటెడ్ డే తేదీని ఇంత వరకు నిర్ణయించక పోవడంతో ఆ తేదీని గెజిట్‌లో పొందుపర్చలేదు. శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పునర్ విభజన బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లుకు (తెలంగాణ బిల్లుకు) కూడా ఆయన ఆమోద ముద్ర వేశారు. శాసనసభను సుప్త చేతనావస్థలో ఉంచి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రివర్గం సిఫార్సు చేశారు.

తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో అపాయింటెడ్ డేను ప్రటించాల్సి ఉంటుంది. అపాయింటెడ్ డే నిర్ణయించడానికి కనీసం 8 నుంచి పది పని దినాలు కావాల్సి ఉంటుందని అంటున్నారు.
అయితే, అందుకు మూడు నెలలు పట్టే అవకాశం ఉందని హోం శాఖ మంత్రిత్వ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుత స్థితిలో ఉమ్మడి రాష్ట్రంలోనే వచ్చే లోకసభ, శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికలు ముగిసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ ఆవిర్భావ తేదీని నిర్ణయానికి సమయం పట్టే అవకాశం ఉండడం వల్ల, త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నందున ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications