తిరుపతి ఉపఎన్నికలో ఏ పార్టీ కావాలో తెల్చుకోండి: ఏపీ సర్కారుకు బండి సంజయ్ హెచ్చరిక

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. ఈ దాడులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకోవావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏపీ ప్రజల సహనాన్ని పిరికితనంగా భావించొద్దని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Recommended Video

    Pawan Kalyan Turns Sanjay Sahu | YSRCP నేతలపై సాలిడ్ పంచ్
    బీజేపీ కార్యకర్తలు రోడ్డెక్కితే ఏపీ సర్కారు మూటలు సర్దుకోవాల్సిందే..

    బీజేపీ కార్యకర్తలు రోడ్డెక్కితే ఏపీ సర్కారు మూటలు సర్దుకోవాల్సిందే..

    ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని, బీజేపీ కార్యకర్తలు రోడ్డెక్కితే వైసీపీ ప్రభుత్వం మూటాముల్లె సర్దుకునేలా తరిమికొడతారన్నారు. తిరుపతి ఉపఎన్నిక ఫలితం కోసం దేశమంతా ఎదురుచూస్తోందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ షాక్ ట్రీట్‌మెంట్ తప్పదని హెచ్చరించారు.

    ఏపీలో బలమైన కార్యకర్తలు.. పిరికితనంగా భావించొద్దు..

    ఏపీలో బలమైన కార్యకర్తలు.. పిరికితనంగా భావించొద్దు..

    ఏపీలో హిందూ ధర్మంపై అధికార పార్టీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారన్నారు. దేవుళ్ల విగ్రహాలను దుర్మార్గంగా ధ్వంసం చేస్తున్నారన్నారు. ఇక్కడ అధికార పార్టీ ఒక మతానికి వత్తాసు పలుకుతుంటే... అక్కడ ఒక మతమే రాజ్యం ఏలుతోందని అన్నారు. ఏపీలో దమ్మున్న కార్యకర్తలు ఉన్నారని, వారి సహనాన్ని పిరికితనంగా భావించొద్దన్నారు.

    తిరుపతి ప్రజలు ఆలోచించుకోవాలి..

    తిరుపతి ప్రజలు ఆలోచించుకోవాలి..

    ఒక మతానికి వత్తాసు పలికితే ఇక్కడ హిందువులు ఓటు బ్యాంకుగా మారి దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు బండి సంజయ్. తిరుపతిలో హిందువులు కూడా ఓటు బ్యాంకుగా మారాలని పిలుపునిచ్చారు. ఏడుకొండల వాడ వెంకటరమణ అనే పార్టీ కావాలా? బైబిల్ చేత పట్టుకుని ప్రచారం చేసే పార్టీ కావాలా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని బండి సంజయ్ అన్నారు.

    కేసీఆర్ పంచన చేరినొళ్లు తెలంగాణ ద్రోహులే..

    కేసీఆర్ పంచన చేరినొళ్లు తెలంగాణ ద్రోహులే..

    తెలంగాణలో ఉద్యమకారులు కనుమరుగయ్యారని బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ పంచన చేరినవాళ్లు తెలంగాణ ద్రోహులేనని వ్యాఖ్యానించారు. ప్రముఖ కళాకారుడు దరువు ఎల్లన్న బీజేపీలో చేరిన సందర్భంగా సంజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా సంజయ్‌కు ‘ఉద్యమ చరిత్ర' పుస్తకాన్ని ఎల్లన్న బహూకరించారు. యుద్ధంలో చివరి వరకు బండి సంజయ్‌తోనే ఉంటానని ఎల్లన్న ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+