ఢిల్లీలో తెలంగాణ సంబరం, అంజన్ స్టెప్పులు (పిక్చర్స్)
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడంతో తెలంగాణ వాదుల్లో ఆనందం వెల్లివిరిసింది. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణవాదులు సంబరాలు జరుపుకోగా ఢిల్లీలోనే ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలతోపాటు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల తెలంగాణ ప్రాంత నాయకులు, కార్యకర్తలు, తెలంగాణవాదులు అక్కడే సంబరాలను చేసుకున్నారు.
ఢిల్లీలోని ఏపీభవన్‌లోనూ తెలంగాణవాదులు ఆనందోత్సవాలు నిర్వహించుకున్నారు. తెలంగాణ జెఏసి నేతలు కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్, దేవీప్రసాద్, విఠల్, అద్దంకి దయాకర్, కత్తి వెంకటస్వామి, రాజేందర్‌రెడ్డి, ప్రహ్లాద్, రఘు, నారాయణ, సత్యం, నారాయణ తదితరులు అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరి ఆనందోత్సహాల్లో మునిగి తేలారు.
ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ బృందం కాంగ్రెస్ జెండాలు, డప్పు వాయిద్యాలు, సోనియాగాంధీ చిత్రపటాలతో ఏపీ భవన్‌లో అడుగుపెట్టింది. ఈ బృందానికి ఎంపి అంజన్‌కుమార్ యాదవ్ సారథ్యం వహించారు. అక్కడికి కాంగ్రెస్ నాయకులు డి శ్రీనివాస్, దామోదర రాజనర్సింహ, జె.గీతారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, షబ్బీర్ అలీ, ఆరేపల్లి మోహన్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి చేరుకొని, విజయోత్సవాల్లో పాలుపంచుకున్నారు.
బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, నాగం జనార్దన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తదితరులు తమ పార్టీ జెండాలను పట్టుకొని సంబురాలు చేసుకున్నారు. ఈ మూడు బృందాల సభ్యులూ పరస్పరం తారసపడినప్పుడు అభినందనలు తెలుపుకొన్నారు.

ఆనందోత్సాహాలు
తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడంతో తెలంగాణ వాదుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న తెలంగాణవాదులు.

మిఠాయిలు పంచుతూ..
తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడంతో తెలంగాణ వాదుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపి హన్మంతరావు పలువురికి స్వీట్లు పంచుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

సోనియా చిత్రపటాలతో..
తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడంతో తెలంగాణ వాదుల్లో ఆనందం వెల్లివిరిసింది. సోనియా గాంధీ చిత్ర పటాలతో జై తెలంగాణ నినాదాలు చేస్తున్న కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, ఎంపీలు హన్మంతరావు, పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, తదితరులు.

జైరాంతో వీహెచ్
తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడంతో తెలంగాణ వాదుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జైరాం రమేష్‌కు మిఠాయిలు పంచుతున్న ఎంపి హన్మంతరావు.

జెఏసి నేతల ఆనందం
తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడంతో తెలంగాణ వాదుల్లో ఆనందం వెల్లివిరిసింది. న్యూఢిల్లీలోని ఏపి భవన్‌లో తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాస్ గౌడ్, ఇతర జెఏసి నేతలు, తెలంగాణవాదుల సంబరాలు.

కోదండారం
తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడంతో తెలంగాణ వాదుల్లో ఆనందం వెల్లివిరిసింది. తెలంగాణ రాజకీయ జెఏసి ఛైర్మన్ కోదండరాంను ఎత్తుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న తెలంగాణవాదులు.

దామోదర, పొన్నాల..
తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడంతో తెలంగాణ వాదుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఏపి భవన్‌కు చేరుకున్న కాంగ్రెస్ నాయకులు డి శ్రీనివాస్, దామోదర రాజనర్సింహ, జె.గీతారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, షబ్బీర్ అలీ, ఆరేపల్లి మోహన్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి చేరుకొని, విజయోత్సవాల్లో పాలుపంచుకున్నారు.

చిందేసిన యాదవ్
తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడంతో తెలంగాణ వాదుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఏపి భవన్‌లో డప్పువాయిద్యాలకు అనుగుణంగా స్టెప్పులేసిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్, తెలంగాణవాదులు.

దరువేసిన దామోదర
తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడంతో తెలంగాణ వాదుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఏపి భవన్‌లో బ్యాండ్ బజాయిస్తున్న కాంగ్రెస్ నాయకుడు దామోదర రాజనర్సింహ, అంజన్ కుమార్ యాదవ్.

టపాసుల కాలుస్తూ..
తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడంతో తెలంగాణ వాదుల్లో ఆనందం వెల్లివిరిసింది. టపాసులు కాలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు.

సోనియా చిత్రం పటంతో అంజన్
తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడంతో తెలంగాణ వాదుల్లో ఆనందం వెల్లివిరిసింది. డప్పువాయిద్యాలతో ఏపి భవన్‌కు చేరుకుంటున్న కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్, తెలంగాణవాదులు.












Click it and Unblock the Notifications