మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెదక్ ఉప ఎన్నిక: కెసీఆర్ సహాయకుడికే టికెట్!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: త్వరలో జరగనున్న మెదక్ ఉప ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్ది ఎంపికపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు పార్టీ సభ్యులతో సోమవారం సాయంత్రం చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. మెదక్ జిల్లా ఉప ఎన్నిక రేసులో టీఎన్జీవో నాయకుడు దేవీ ప్రసాద్ తో పాటు కెసీఆర్‌తో ముఖ్య సహాయకుడిగా ఉంటున్న సుభాష్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

మెదక్ లోక్ సభ పార్లమెంట్ స్దానానికి జరుగుతోన్న ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను బిజెపి-తెలుగుదేశం కూటమితో పాటు కాంగ్రెసు పార్టీలు పంచుకోవడం వల్ల టీఆర్ఎస్ అభ్యర్దిగా నిలబడనున్న అభ్యర్ది గెలవడంలో ఎటువంటి సందేహాం లేదనే అభిప్రాయంతో ఉన్నారు. ఈ లోకసభ స్దనానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ లోక సభ పరిధిలో ఉన్న అన్ని శాసనసభ స్దానాలు కూడా టీఆర్‌ఎస్ వి కాడవం విశేషం.

Telangana Chief Minister's aide, TNGOs chief in race for Medak Lok Sabha bypoll ticket

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, తెలంగాణ మంత్రి టి. హారీష్ రావు శాసనసభా స్థానాలు ఈ లోకసభ పరిధిలోనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖరరావు భాద్యతలు స్వీకరించి, ఎంపిగా రాజీనామా చేయడంతో ఈ లోక సభ స్దానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఏప్ర్లిల్, 2014లో జరిగిన ఎన్నిక్లలో కె. చంద్రశేఖరరావు మెదక్ లోక సభ స్దానం నుండి పార్లమెంట్ సభ్యుడిగా, గజ్వేల్ నుండి శాసనసభ్యుడిగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కె. చంద్రశేఖరరావు తన ప్రత్యర్దులపై 3.97 లక్షల ఓట్ల మెజారీటీతో గెలుపొందారు.

ఇక మెదక్ లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిని ఎంపిక చేసే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిదేనని రాష్ట్ర ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. పొత్తులో భాగంగా మెదక్ లోకసభ స్థానంలో బిజెపి అభ్యర్థికి మద్దతు తెలపాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.

English summary

 
 Telangana CM and Telangana Rastra samithi (TRS) chief k Chandrasekhar Rao (KCR) has convened a meeting on Monday to finalise the candidate. TNGO leader Devi Prasad, CM’s key aide Subhash Reddy, Kotta Prabhakara Reddy and Praveen Kumar Reddy are in the race.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X