• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

17న విజ‌య‌వాడ‌కు కేసీఆర్‌: జ‌గ‌న్‌తో కీల‌క భేటీ: గ‌వ‌ర్న‌ర్ సైతం వ‌స్తున్నారు..!

|

ఏపీ-తెలంగాణ ముఖ్య‌మంత్రులు మ‌రో సారి భేటీ కానున్నారు. ఈ భేటీకి విజ‌య‌వాడ వేదిక కానుంది. అదే స‌మ‌యం లో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ సైతం అక్క‌డ‌కు వ‌స్తున్నారు. ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ఉండ‌వ‌ల్లిలోని జ‌గ‌న్ నివాసానికి రానున్నారు. అక్క‌డ నుండి విజ‌య‌వాడ చేరుకుంటారు. అక్క‌డ జ‌రిగే భేటీలో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రి రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌స్య‌ల పైన చ‌ర్చించ‌నున్నారు. ఆ త‌రువాత స్వ‌రూపానంద స‌ర‌స్వతీ స్వామి నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.

వర్కౌట్ కాని కారు.. పదహారు ఫార్ములా..! కాళేశ్వరంతో కాషాయానికి దగ్గరవ్వాలనుకుంటున్న గులాబీ బాస్..!!

జ‌గ‌న్ నివాసానికి కేసీఆర్‌..

జ‌గ‌న్ నివాసానికి కేసీఆర్‌..

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈనెల 17న ఏపీకి రానున్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నివాసానికి వ‌చ్చి అక్క‌డ

21న జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జ‌గ‌న్‌ను ఆహ్వానించ‌నున్నారు. త‌న నివాసానికి వ‌స్త‌న్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను జ‌గ‌న్ మ‌ధ్నాహ్న లంచ్‌కు ఆహ్వానించారు. ఆ త‌రువాత ఇద్ద‌రూ క‌లిసి విజ‌య‌వాడ చేర‌కొని అక్క‌డ విభజన సమస్యలపైనా ఇద్దరు సీఎంలు చ‌ర్చించ‌నున్నారు. గ‌తంలో రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ స‌మ‌క్షంలో జ‌రిగిన స‌మావేశంలో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రి కొన్ని స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం చ‌ర్చించారు. దీని మేర‌కు హైద‌రాబాద్‌లో ఏపీ నియంత్ర‌ణ‌లో ఉంటూ నిరుపయోగంగా ఉన్న భ‌వ‌నాల అప్ప‌గింత మీద ఒప్పందం జ‌రిగింది. ఇక‌, మిగిలిని అంశాల మీద ఈ స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు.

స‌మ‌స్య‌ల పైన ఇద్ద‌రు సీఎంల క‌స‌ర‌త్తు..

స‌మ‌స్య‌ల పైన ఇద్ద‌రు సీఎంల క‌స‌ర‌త్తు..

అటు తెలంగాణ‌లో..ఇటు ఏపీలో పెండింగ్ ఉన్న స‌మ‌స్య‌ల పైన ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు నివేదిక‌లు సిద్దం చేయాల ని అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌ధానంగా ఇంకా కొలిక్కి రాని ఉద్యోగులు..ఆస్తులు..అప్పులు..సంస్థ‌ల విభ‌జ‌న వంటి అంశాల పైన చ‌ర్చ చేయ‌నున్నారు. ప్రధానంగా విద్యుత్తు ఉద్యోగుల విభజన, రెండు రాష్ట్రాల మధ్య నిధుల పంచాయి తీని తేల్చే అవకాశం ఉంది. ప్రధానంగా షెడ్యూల్‌ 9, 10లోని ప్రభుత్వరంగ సంస్థల విభజన, విద్యుత్‌ ఉద్యోగుల పంప కాలు, విద్యుత్‌ బిల్లుల బకాయిలు తదితర సమస్యలను రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సింది. కరెంట్‌ బకాయిల పై తెలంగాణ డిస్కమ్‌లను దివాలా తీసినట్లుగా ప్రకటించి, బకాయిలను వసూలు చేసి ఇవ్వాలని ఏపీ విద్యుత్తు సంస్థలు ఎన్‌సీఎల్‌టీలో కేసు వేశాయి. ఈ కేసులో రెండు రాష్ట్రాల విద్యుత్తు సంస్థల వాదనలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఈ అంశం పైన ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

గ‌వ‌ర్న‌ర్ సైతం రాక‌...స్వామీజీ స‌మ‌క్షంలో

గ‌వ‌ర్న‌ర్ సైతం రాక‌...స్వామీజీ స‌మ‌క్షంలో

ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌తో పాటుగా గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ సైతం ఈ నెల 17న విశాఖ శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానంద స‌ర‌స్వ‌తి ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. ఈ కార్య‌క్ర‌మాల‌ను స్వ‌రూపానంద స‌ర‌స్వ‌తి వివ‌రించారు. లోక

కల్యాణార్ధం సన్యాసికారి కార్యక్రమం చేస్తున్నామని.. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సమృద్ధిగా వర్షాలు పడాలని సన్యాసిదీక్ష చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 17న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్... తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరువుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana CM KCR arriving vijayawada to invite AP CM Jagan for Kaleswaram Project opening on 21st of this month. Both CM's may discuss about pending issues between both states in re organisation act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more