ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ, త్వరలో కొత్త జిల్లాలని ఇందూరులో ప్రకటన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. లేఖలో ధాన్యం లెవీ సేకరణ నిలిపివేయవద్దని కోరారు. సేకరణ నిలిపివేస్తే
రైతులు మద్దతు ధర కోల్పోయే అవకాశముందని, రైతులు నష్టపోతారని చెప్పారు.
మిషన్ కాకతీయ ప్రారంభం

తెలంగాణ సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలో మిషన్ కాకతీయను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఎల్లారెడ్డికి వరాలు కురిపించారు. ముస్లీంలకు షాదీఖానా ఏర్పాటు చేస్తామని, వంద
గ్రామాలకు సీసీ రోడ్లు వేస్తామని చెప్పారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గానికి పదకొండు విద్యుత్ ఉపకేంద్రాలు, 130 కేవీ విద్యుత్ ఉపకేంద్రం మంజూరు చేస్తామన్నారు. కాయిత లంబాడీలను త్వరలో ఎస్టీల్లో చేర్చుతామని చెప్పారు. నాలుగేళ్లలో ఇంటింటికి నల్లా
నీళ్లు ఇస్తామని చెప్పారు. ఇవ్వని పక్షంలో ఓట్లు అడగమన్నారు. త్వరలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలోకి 13 నియోజకవర్గాలు వస్తాయన్నారు. కామారెడ్డిని జిల్లాగా చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications