తొందరపడను: కేసీఆర్, వందల కోట్ల ధనంపై సీరియస్‌గా

హైదరాబాద్: తొందరపడి నిర్ణయాలు తీసుకునేది లేదని, పాలన పైన పరిపూర్ణమైన అవగాహన తర్వాతే తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం అన్నారు. ఎంసీహెచ్ఆర్డీలో 'నవ తెలంగాణ సమాలోచన' పేరిట విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడారు. ఇప్పటి వరకు జరిగిన చట్టాలు ఆంధ్రప్రదేశ్ కాంటెస్ట్‌లో జరిగాయని, వాటిని మార్చాల్సి ఉందని చెప్పారు.

మనం చిత్తశుద్ధితో నవ తెలంగాణను నిర్మించుకుందామని చెప్పారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో అందరు భాగస్వాములు కావాలన్నారు. నేటి మేథోమథనం భవిష్యత్తుకు పునాది అని చెప్పారు. ప్రభుత్వ విధానం హైదరాబాద్ నుండి కాదని.. గ్రామస్థాయి నుండి రాజధానికి ఉండాలన్నారు. తెలంగాణలో కుటుంబాల కంటే రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అదనంగా ఉన్న రేషన్ కార్డులు ఎక్కడున్నాయో తేలాలన్నారు.

వందల కోట్ల ప్రజాధనం ఎక్కడికి పోతుందో తెలియాల్సి ఉందన్నారు. వీటిపై అధికారులు సీరియస్‌గా కసరత్తు చేయాలన్నారు. ఎంతకష్టమైనా తాము హామీలను నెరవేర్చుతామని చెప్పారు. అవకతవకలకు పాల్పడిన వారు ఎంత వారైనా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో అక్రమాలకు పాల్పడిన వారు మళ్లీ కాచుక్కూర్చున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆదాయంలో రూపాయి వృథా కాదన్నారు. ప్రభుత్వ పథకాల్లో అవినీతికి ఆస్కారం లేదన్నారు.

Telangana development: KCR in MCHRD

సర్దుకోవడానికే ఇన్ని రోజులు పడితే.. నిలదొక్కుకునేందుకు మరిన్ని రోజులు పడుతుందన్నారు. పాలన పైన పూర్తి అవగాహన తర్వాతే నిర్ణయాలు అని చెప్పారు. శాఖల వారిగా పూర్తిస్థాయి అవగాహన వచ్చిందన్నారు. తెలంగాణలో ఉన్న వనరులు, మౌలికా సదుపాయాలు, వసతుల ఆధారంగా ప్లాన్ తయారు కావాలన్నారు. ప్రభుత్వ పథకాల్లో అవినీతికి ఆస్కారం లేదన్నారు. అవకతవకలకు పాల్పడితే ఎంత వారైనా చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రభుత్వ పథకాల అమలులో రూపాయి కూడా వృథా కానివ్వమన్నారు. ప్రజాప్రతినిధులకు శిక్షణా తరగతులు ఉంటాయని చెప్పారు. త్వరలో సర్పంచ్‌ల నుండి ఎమ్మెల్యేల వరకు శిక్షణ ఉంటుందని, త్వరలో తేదీలు నిర్ణయిస్తామన్నారు. ఇందుకోసం ఎంత ఖర్చుకైనా సిద్ధమన్నారు. గృహనిర్మాణ శాఖలో భారీగా అవకతవకలు జరిగాయన్నారు. గతంలో అనేక తప్పులు జరిగాయన్నారు. పేదలకు ఇళ్లు కట్టించే విషయానికి తాము కట్టుబడి ఉన్నారు. అలాగే లక్ష రూపాయల రుణమాఫీకి కట్టుబడి ఉన్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+