పెద్దల భూములపై దృష్టి: టాలీవుడ్‌కు మరో టీ షాక్
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం నుండి మరో షాక్ తగలనుందా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ త్వరలో పలువురు టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు ఇవ్వనుందట! ప్రభుత్వం చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఇచ్చిన భూములను కమర్షియల్ పర్పస్‌లో వినియోగిస్తున్న పలువురికి నోటీసులు ఇవ్వనుందట.
తొలుత తెలుగు పరిశ్రమ చెన్నైలో ఉన్న విషయం తెలిసిందే. హైదరాబాదులో తెలుగు చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు నాటి ప్రభుత్వాలు 1983 నుండి 1999 వరకు పలువురికి సబ్సిడీతో ఎకరాల భూమిని ఇచ్చింది. ఆ భూములలో ఫిల్మ్, అండ్ రికార్డింగ్ స్టూడియోలు తదితరాలు పెట్టుకోవచ్చు.

అయితే, భూములు పొందిన పలువురు ప్రముఖులు కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టారు. ఇందులో పలువురు ప్రముఖులు ఉన్నారు. దీంతో వారికి నోటీసులు ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ భావిస్తోందట. టాలీవుడ్ ప్రముఖులకు ఇచ్చిన భూములలో నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్ కాంప్లెక్సులు తదితరాలు కట్టినట్లుగా హైదరాబాద్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ గుర్తించింది.
స్వర్గీయ పీ జనార్ధన్ రెడ్డి, నాటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఆ భూములలో కమర్షియల్ కాంప్లెక్సులు కట్టడాన్ని అప్పుడే వ్యతిరేకించారు. సినిమా పరిశ్రమ ప్రోత్సాహం కోసం అని తీసుకున్న భూములను కమర్షియల్ కాంప్లెక్స్‌గా మార్చిన వారికి త్వరలో నోటీసులు ఇవ్వనున్నారట.












Click it and Unblock the Notifications