చిత్రపరిశ్రమకు కేసీఆర్ షాక్: ఏపీఎఫ్‌డీసీ భూమి వెనక్కి

మచిలీపట్నం చేరుకున్న షిర్డీ బస్సు ప్రమాద మృతదేహాలు
మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి భౌతికకాయాలను స్వస్థలం మచిలీపట్నానికి తరలించారు. బస్సులో ప్రమాదంలో మృతి చెందిన ఎనిమిది మంది మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఘటనలో గాయపడ్డ 36 మంది భక్తులను నిన్న సాయంత్రం ప్రత్యేక విమానంలో గన్నవరం తీసుకువచ్చారు. మృతుల కుటుంబసభ్యులను మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. బాధిత కుటుంబాలకు రూ.2లక్షలు, బాధితులకు రూ.50వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
కొమరం భీంకు టీటీడీపీ నివాళి
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో కొమరం భీం వర్ధంతిని టీటీడీపీ ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీకి చెందిన గిరిజన నేతలు కొమురంభీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. గిరిజన బిడ్డలకు కొమురంభీమ్ దైవసమానుడని మాజీ ఎమ్మెల్యే సీతక్క అన్నారు.












Click it and Unblock the Notifications