హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనుమతివ్వండి: ఢిల్లీకి టీ లేఖ, గోల్కొండ కోట(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలకు అనుమతి తీసుకోలేదని చెబుతూ ఆర్మీ పహారా కాస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ స్పందించింది. గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించేందుకు తాము అవసరమైతే పురావస్తు, ఆర్మీ శాఖల అనుమతులు కోరుతామని తెలిపింది.

తాము ఇప్పటి వరకు ఆర్మీ భూముల్లోకి వెళ్లలేదన్నారు. శాశ్వతంగా అక్కడే వేడుకలను నిర్వహించాలనుకుంటే అందుకు అవసరమైన అనుమతులు కోరుతామని చెప్పారు. గోల్కొండ కోటలోనే పంద్రాగస్టు వేడుకలు ఎక్కడ నిర్వహించాలనేది ఇంకా తాము నిర్ణయించలేదన్నారు. గోల్కొండ కోటలో 51 ఎకరాల భూమి రెవెన్యూ శాఖదని, 31 ఎకరాలు ఆర్మీది అని హైదరాబాద్ కలెక్టర్ చెప్పారు. ఆ భూముల పైన సర్వే చేసి సీఎంకు నివేదిక ఇస్తామని తెలిపారు. గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు ఎక్కడ అనేది త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు.

ఢిల్లీలోని పురావస్తు శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని పురావస్తు శాఖకు లేఖ రాసింది. తమకు గోల్కొండ కోటలో వేడుకలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. రెండు రోజుల్లో అనుమతులు వచ్చే అవకాశముంది. ఆర్మీ పహారా నేపథ్యంలో రెవెన్యూ, ఆర్మీ అధికారులతో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ భేటీ అయ్యారు. మరోవైపు, గోల్కొండ కోటలో రెవెన్యూ, డిఫెన్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోటలో అధికారులు...

గోల్కొండ కోట

గోల్కొండ కోట

పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం కోటలో పోలీసు ఫోర్స్.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం కోటలో పోలీసు ఫోర్స్.

కేసీఆర్

కేసీఆర్

కాగా, గోల్కొండ కోటలో వేడుకలకు అనుమతి లేదని ఆర్మీ పహారా కాస్తుండటంతో.. తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని పురావస్తు శాఖకు అనుమతి కోసం లేఖ రాసింది. రెండు రోజుల్లో అనుమతి వచ్చే అవకాశముంది.

English summary
Telangana government write letter to Department of Archaeology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X