టీ షాక్: ఏపీఎన్జీవోల భూములు వెనక్కి, పరిశీలన!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోల ఇళ్లస్థలాలకు కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. ఈ భూముల తాజా పరిస్థితిపై నివేదిక పంపాలని రంగారెడ్డి జిల్లా యంత్రాంగానికి తెలంగాణ ప్రభుత్వం ఆదేశించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
జిల్లా యంత్రాంగం పంపిన నివేదికను మంగళవారం భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) కార్యాలయంలో సీసీఎల్ఏ పరిశీలించారు. ఏపీఎన్జీవోలకు కేటాయించిన భూమిపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కే సిన్హా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎన్ శ్రీధర్‌తో సుదీర్ఘంగా చర్చించారు.

ఏపీఎన్జీవో హౌసింగ్ సొసైటీకి కేటాయించిన భూములను ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఉపయోగించుకోకపోవడంతో... వాటిని స్వాధీనం చేసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు.
దీంతో బుధవారం నుంచి రంగారెడ్డి జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఏపీఎన్జీవోల భూములపై దృష్టి సారించనుందంటున్నారు. ఏపీఎన్జీవోల సొసైటీకి ఇప్పటికే రెండుసార్లు ప్రభుత్వం భూమిని కేటాయించింది. రెండువర్గాల మధ్య విభేదాలు రావడంతో తొలిసారి కేటాయింపులు రద్దు చేశారు. ఆ తర్వాత రెండు గ్రూపులు ఏకం కావడంతో 2008లో 189.11 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.












Click it and Unblock the Notifications