జెపికి హైదరాబాద్‌లో తెలంగాణ సెగ: తిరుపతిలో ఉద్రిక్తత
హైదరాబాద్/ తిరుపతి: లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణకు హైదరాబాదు నగరంలో తెలంగాణ సెగ తగిలింది. శనివారం ఉదయం చందానగర్‌లో పర్యటిస్తున్న జయప్రకాష్ నారాయణను, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాస్‌ను స్థానిక తెలంగాణ నేతలు అడ్డుకున్నారు.
దీంతో తెలంగాణ వాదులు, లోక్‌సత్తా కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఇరు పక్షాల మధ్య ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడింది. జెపి తెలంగాణకు అనుకూలంగానే ఉన్నారని చెప్పడానికి ప్రయత్నాలు చేశారు. స్థానిక సమస్యలను తెలుసుకోవడానికి జెపి ఈ పర్యటనను ఉద్దేశించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్ట్స్ కాలేజీలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం జరిగిన 66 రోజులకు విద్యార్థుల హాజరుశాతం తక్కువగా ఉంది. దీంతో భారీగా హాజరు తగ్గిన విద్యార్థులకు కాలేజీ యాజమాన్యం ఫైన్ వేయడంతో విద్యార్థులు ధర్నా చేపట్టారు.
ప్రిన్సిపాల్ కారును ధ్వంసానికి విద్యార్థులు యత్నించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని లాఠీచార్జి జరిపి విద్యార్థులను చెదరగొట్టారు.












Click it and Unblock the Notifications