హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ సభ: అడ్డుకునేందుకు విద్యార్థులు ఇలా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సభకు తెలంగాణ సెగ తగిలింది. ఉస్మానియా ఐక్యకార్యాచరణ సమితికి చెందిన శ్రీరామ్, ఆటో డ్రైవర్ సతీష్ గౌడ్, సిద్దిపేటకు చెందిన శ్రీనివాస్ రెడ్డిలు వేర్వేరు సమయాల్లో సభా వేదిక ముందు తెలంగాణ నినాదాలు చేశారు. పోలీసులు వారిని బయటకు పంపించారు.

నిజాం కళాశాల విద్యార్థులు సమైక్య శంఖారావ సభలోకి వెళ్లే ప్రయత్నాలు చేశారు. నిజాం కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు వైయస్ జగన్ చిత్ర పటాన్ని దగ్ధం చేశారు. జగన్ సభను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు సైతం బైక్ ర్యాలీతో ఎల్బీ స్టేడియం వెళ్లేందుకు ఆర్ట్స్ కళాశాల నుండి బయలుదేరారు. వారిని పోలీసులు ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకున్నారు. ఇరవ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. విద్యార్థులు బారికేట్లను తొలగించారు. పోలీసులు విద్యార్థులను వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో వారు జగన్ పార్టీ జెండాను దగ్ధం చేశారు.

తెలంగాణ 1

తెలంగాణ 1

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్ర పటాన్ని శనివారం చెప్పుతో కొడుతున్న నిజాం కళాశాల విద్యార్థులు.

తెలంగాణ 2

తెలంగాణ 2

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్ర పటాన్ని శనివారం చెప్పుతో కొడుతున్న నిజాం కళాశాల విద్యార్థులు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.

తెలంగాణ3

తెలంగాణ3

నిజాం కళాశాల విద్యార్థులు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్య శంఖారావం అడ్డుకునేందుకు బయటకు వచ్చే ప్రయత్నాలు చేస్తుండగా పోలీసులు అడ్డుకుంటున్న దృశ్యం.

తెలంగాణ 4

తెలంగాణ 4

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి శవ యాత్ర చేస్తున్న నిజాం కళాశాల విద్యార్థుల దృశ్యం.

తెలంగాణ 5

తెలంగాణ 5

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి శవ యాత్ర చేసిన అనంతరం దహనం చేస్తున్న దృశ్యం.

తెలంగాణ 6

తెలంగాణ 6

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి శవ యాత్ర చేసిన అనంతరం దహనం చేస్తున్న దృశ్యం.

తెలంగాణ 7

తెలంగాణ 7

ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు బైక్ ర్యాలీతో ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సమైక్య శంఖారావ సభ వద్దకు వెళ్లేందుకు ఆర్ట్స్ కళాశాల నుండి బయలుదేరుతున్న దృశ్యం.

తెలంగాణ 8

తెలంగాణ 8

ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు బైక్ ర్యాలీతో ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సమైక్య శంఖారావ సభ వద్దకు వెళ్లేందుకు ఆర్ట్స్ కళాశాల నుండి బయలుదేరారు. ఎన్‌సిసి గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

తెలంగాణ 9

తెలంగాణ 9

ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు బైక్ ర్యాలీతో ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సమైక్య శంఖారావ సభ వద్దకు వెళ్లేందుకు ఆర్ట్స్ కళాశాల నుండి బయలుదేరారు. ఎన్‌సిసి గేటు వద్ద పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం.

తెలంగాణ 10

తెలంగాణ 10

ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు బైక్ ర్యాలీతో ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సమైక్య శంఖారావ సభ వద్దకు వెళ్లేందుకు ఆర్ట్స్ కళాశాల నుండి బయలుదేరారు. ఎన్‌సిసి గేటు వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను తొలగిస్తున్న విద్యార్థులు.

తెలంగాణ 11

తెలంగాణ 11

ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు బైక్ ర్యాలీతో ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సమైక్య శంఖారావ సభ వద్దకు వెళ్లేందుకు ఆర్ట్స్ కళాశాల నుండి బయలుదేరారు. ఎన్‌సిసి గేటు వద్ద పోలీసులు వర్సెస్ విద్యార్థులు.

తెలంగాణ 12

తెలంగాణ 12

ఓయులో విద్యార్థులు బైక్ ర్యాలీతో ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సమైక్య శంఖారావ సభ వద్దకు వెళ్లేందుకు ఆర్ట్స్ కళాశాల నుండి బయలుదేరారు. ఎన్‌సిసి గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో నినాదాలు చేస్తున్న పోలీసులు.

తెలంగాణ 13

తెలంగాణ 13

ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు బైక్ ర్యాలీతో ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సమైక్య శంఖారావ సభ వద్దకు వెళ్లేందుకు ఆర్ట్స్ కళాశాల నుండి బయలుదేరారు. ఎన్‌సిసి గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో జెండాను దగ్ధం చేస్తున్న విద్యార్థులు.

English summary
Telangana activists protest at YSR Congress Party's Samaikya Sankaravam on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X