టీ ఉన్నత విద్యామండలి: ఎంసెట్‌పై కోదండరామ్ ఫైర్
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంటు వివాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉన్నత విద్యామండలిని ఏర్పాటు చేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదం, ఎంసెట్ కౌన్సింగ్ నేపథ్యంలో ఏపీ ఉన్నత విద్యామండలి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వివాదం చోటు చేసుకుంది.
ఈ వివాదం నేపథ్యంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పున ర్వవస్థీకరణ 2014 చట్టం ప్రకారం తెలంగాణ ఉన్నత విద్యామండలిని ఏర్పాటు చేస్తూ జీవోఎంసెస్ నెంబర్ 5ను విడుదల చేసింది. తెలంగాణ ఉన్నత మండలి ఆధ్వర్యంలో ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

View this message in your browser

View this message in your mobile

[FORWARD]

Unsubscribe

View this message in your browser

View this message in your mobile

[FORWARD]

Unsubscribe

](https://imagesvs.oneindia.com/te/img/2014/08/02-kcrcm-606.jpg)
మరోవైపు అధికారులతో ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ సమావేశమయ్యారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఏర్పాటు అంశాన్ని సుప్రీం కోర్టులో ప్రస్తావించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కాగా, ఎంసెట్ కౌన్సిలింగ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి పరిధి దాటి వ్యవహరిస్తోందని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. శనివారం నగరంలో తెలంగాణ జేఏసీ స్టీరింగ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడారు.
ఎసెంట్ కౌన్సిలింగ్ ప్రక్రియ న్యాయస్థానం పరిధిలో ఉండగా ఉన్నత విద్యా మండలి ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈనెల 6న ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.
ఆర్టీసీలో తెలంగాణలోని లాభాలతో ఆంధ్రా ఆర్టీసీ నష్టాలను పూడుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ, హైకోర్టును విభజించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 9న ఆదివాసీల దినోత్సవాన్ని పోలవరం వ్యతిరేక దినంగా పాటించాలని కోదండరాం పిలుపునిచ్చారు.

Click it and Unblock the Notifications